పిల్లలను కింద పడుకోబెట్టగానే నిద్రలేస్తారు ఎందుకంటే..!

పిల్లలను కింద పడుకోబెట్టగానే నిద్రలేస్తారు ఎందుకంటే..!


చిన్న పిల్లల విషయంలో చాలా మంది ఎదుర్కునే అతి పెద్ద సమస్య వారిని నిద్రపుచ్చడం.  పిల్లలను ఎత్తుకుని నిద్ర పుచ్చినా సరే.. వాళ్లను మంచం మీద లేదా ఉయ్యాలలో పడుకోబెట్టగానే టక్కున లేస్తుంటారు. చాలామంది తల్లులు ఈ సంఘటనలకు పిల్లల మీద చిరాకు కూడా పడుతూ ఉంటారు. అయితే పిల్లలు కావాలని ఇలా నిద్రలేవరు. దీని వెనుక చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి.   అవేంటో తెలుసుకుంటే..


పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది.  వారి శరీరంలో కదలికలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి.  వారి శరీరం అభివృద్ది చెందే దశలో ఉంటుంది. తల్లుల కంటే కూడా పిల్లల శరీరం చాలా చురుగ్గా రియాక్ట్  అవుతుంది.  మరీ ముఖ్యంగా నవజాత శిశువులు చాలా తొందరగా రియాక్ట్ అవుతారు.  

స్టార్టల్ రిప్లెక్స్..

మోరో రిఫ్లెక్స్ నే స్టార్టెల్ రిఫ్లెక్స్ అని కూడా పిలుస్తారు.   పడుకున్నప్పుడల్లా  బిడ్డ మేల్కొనడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇది మొదటి 4 నెలలు చాలా బలంగా ఉంటుంది. ఇది ఉష్ణోగ్రత తగ్గడం, ఉష్టోగ్రతలో మార్పు లేదా ఉన్నట్టుండి కదలడం  వంటి చర్యల ద్వారా జరుగుతుంది. బిడ్డ చేతులు చాచి, శరీరాన్ని బిగించి, ఏడుస్తూ మేల్కొనేలా చేస్తుంది.

 శిశువులకు శారీరక సాన్నిహిత్యం మరియు స్పర్శ కోసం బలమైన కోరిక ఉంటుంది, ముఖ్యంగా మొదటి 6 నెలలు ఇది ఎక్కువగా ఉంటుంది.  పిల్లలు తల్లికి దగ్గరగా ఉన్నప్పుడు భద్రతగా ఫీలవుతారు.

గ్యాస్, రిప్లక్స్..

పిల్లలు పాలు తాగిన తర్వాత వారిని ఎత్తుకుని ఉన్నప్పుడు కడుపులో గాలి బుడగలు త్రేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తాయి.  కడుపు హాయిగా అనిపిస్తుంది. కానీ పిల్లలను పడుకోబెట్టినప్పుడు గాలి కదలకుండా గ్యాస్ గా మారి కడుపుపై ఒత్తిడి పెంచుతుంది.  ఇది పిల్లలు మేల్కోవడానికి కారణం అవుతుంది.

                           *రూపశ్రీ.