Read more!

నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా...

నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా...

చాలామంది మహిళలలో తరచుగా వినిపించే ఫిర్యాదు నడుమునొప్పి. నడుమునొప్పి అనేది ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే వాచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు వయసుతో సంబంధం లేకుండా నడుమునొప్పి వచ్చేస్తోంది. నడుమునొప్పి నివారణ కోసం ఎన్నో రకాల మందులు, పెయిన్ రిలీఫ్ జెల్, పెయిన్ రిలీఫ్ క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది అని కారణం తెలుసుకుంటే దీన్ని నివరించుకోవడం అందరి చేతుల్లోనే ఉంది. మరి నడుము నొప్పి ఎలా వస్తుంది దానికి కారణం ఏమిటి వంటి వివరాలు తెలుసుకుంటే…

నడుమునొప్పి ఎలా వస్తుంది?? ఎందుకు వస్తుంది??

నడుము  అనేది శరీరానికి మధ్యభాగంలో ఉన్న అవయవం. కడుపు పై భాగం నుండి ఉన్న బరువు మొత్తం నడుము మీద పడుతూ ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు లేదా సాధారణంగా అలవాటు ప్రకారము వంగినప్పుడు నడుము భాగం వంచుతూ ఉంటాం. ఫలితంగా నడుము భాగం ప్రభావానికి గురవుతుంది. నడుము వంచిన భంగిమ లేదా నడుము మీద బరువు పడే ప్రాంతాన్ని బట్టి నడుము ప్రాంతం ఒత్తిడికి లోనయ్యి నొప్పి వస్తుంది. ఒకే వైపు బరువు పడటం, ఒకే వైపు వంగి కూర్చోవడం, ఒకే వైపు బరువులు ఎత్తడం, నడవడంలో కూడా ఒకేవైపు బెండ్ కావడం వంటివి జరిగినప్పుడు నడుము ప్రభావానికి గురయ్యి నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి వచ్చే కొన్ని కారణాల, వాటి నివారణకు మార్గాలు ఉన్నాయి…

కూర్చునేటప్పుడు:-

కూర్చునేటప్పుడు   వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి. దీనివల్ల శరీరం సమాంతరంగా ఉండి బరువు ఒకే ప్రాంతంలో పడకుండా ఉంటుంది. నడుము నొప్పి రాకుండా ఉండటం కోసం మాత్రమే కాకుండా నడుమునొప్పి వచ్చినప్పుడు కూడా వీలైనంతవరకు ఇలా కూర్చోవడం అలవాటు చేసుకుంటే నడుమునొప్పి తగ్గిపోతుంది. 

చాలామంది బరువులు ఎత్తుతూ ఉన్నపుడు కాళ్ళను నిటారుగా ఉంచుతారు. ఇలా ఎత్తేటప్పుడు నడుము మీద చాలా ఒత్తిడి పడుతుంది. నడుము భాగంలో కండరాలు, ఎముకలు బిగుసుకున్నట్టు అవుతాయి. అయితే ఇలా బరువు ఎత్తేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ కాస్త తప్పిన అది నడుము మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.   కాబట్టి బరువులు ఎత్తేటపుడు కాళ్ళను 'మోకాళ్ళవద్ద వంచి, బరువులు ఎత్తాలి. 

ఇకపోతే నిలబడినప్పుడు కూడా పద్దతిగా నిలబడాలి. కొండస్రు నిలబడినప్పుడు బరువు మొత్తం ఒక కాలు మీద వేసి నిలబడటం, లేదా ఒకవైపుకు వంగి నడుము ఒకవైపు భాగం మీద బరువు వేయడం, ఒకవైపు మాత్రమే నడుము వంచి ఎక్కువ సేపు ఉండటం వంటివి చేస్తుంటారు. దీనివల్ల నడుమునొప్పి చాలా తొందశరగా వస్తుంది. కాబట్టి నిలబడినట్టు అటు ఇటు బెండ్ అవ్వకుండా నిటారుగా నిలబాడ్స్ట్స్మ్ ఎంతో ముఖ్యం.

పడుకునే సమయంలో కూడా భంగిమ ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవైపుకు తిరిగి పడుకోవడం లేదా పడుకున్న తీరు ఏదైనా శరీరం అస్తవ్యస్తంగా కాకుండా కాస్త నిటారుగా ఉండటం ముఖ్యం. లేకపోతే శరీరం అస్తవ్యస్తంగా ఉన్నట్టు నిద్రపోతే నడుము భాగంలో కండరాలు పట్టేస్తాయి.  పొట్ట కింద భాగంలో ఉండే అబ్డామినల్ కండరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ ఎలాగంటే అలా పడుకునే అలవాటు ఉన్నవాళ్లకు నడుము నొప్పి రాకూడదు అంటే ఒక మంచి చిట్కా ఉంది. పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే పడుకునే విధానం కాస్త మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా నడుము ఒత్తిడికి గురి కాదు.

కుర్చీలో కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి. అంతే కానీ ఒకవైపుకు అనుకుని మూలకు కూర్చోకూడదు. అలాగే కుర్చీ నుండి లేచేతప్పుడు ఒకేసారి పైకి లేవకుండా  ఒక కాలిని ముందుకు, మరొక కాలిని వెనక్కు పెట్టి లేవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే నడుమునొప్పి రాదు. 

ఆడవారిలో ఈమధ్య బాగా విస్తృతం అయిపోయిన అలవాటు హై హీల్స్ వేసుకోవడం. ఇలా హైహీల్స్ వేసుకొంటే నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 

చాలామంది  ఆడవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు రెండు కాళ్ళను ఇంటూ ఆకారంలో ఉంచి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.  కాబట్టి ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.

పైన చెప్పుకున్న కొన్ని చిట్కాలు గమనిస్తే మహిళలు తమకు తెలియకుండా నడుము నొప్పిన బారిన ఎలా పడుతున్నారో కూడా అర్థమవుతుంది. వాటికి సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పికి చెప్పచ్చు బై బై..

                                     ◆నిశ్శబ్ద.