Read more!

బరువు తగ్గడం అమ్మాయిల జన్మహక్కు

 

బరువు తగ్గడం అమ్మాయిల జన్మహక్కు

 

 

బరువు పెరగడం తేలికే కాని తగ్గడం చాలా కష్టం. ఎక్కువ బరువు పెరిగిపోడంవల్ల సులువుగా చేసే పనులు కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఒకే చోట కూర్చొని పనిచేయడం, బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. అలా కాకుండా ఉండాలంటే కింద చెప్పిన చిట్కాలు కొన్ని పాటిస్తే కొంతవరకైనా బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంది.

* సన్నని నాజుకైనా శరీరాకృతి కావాలంటే డైటింగ్ ఒక్కటి చేస్తే సరిపోదు. అందుకు తగిన వ్యాయామం కూడా చేయాలి.

* బాగా ఆకలిగా ఉన్నప్పుడు బయట దొరికే జంక్ ఫుడ్ తినకూడదు. అలా తినడం వల్ల ఎక్కువ కొవ్వు, తక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది.

*ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు డైట్ అసలు చేయకూడదు.

* ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల కేలరీస్ సాయంత్రం వరకు ఉంటాయి. * ఆఫీస్ లకు వెళ్లేవారు ఇంటి దగ్గర తయారుచేసిన ఫుడ్ తీసుకెళ్లడమే మంచిది. ఇది శరీరానికి తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఇస్తుంది.

* ఆహారం తీసుకునేప్పుడు ఎక్కవ సేపు నమిలి తినాలి. ఇలా తినడం వల్ల తక్కువ ఆహారంతోనే మీకు సంతృప్తి కలుగుతుంది.

* ఆహారం తీసుకునే గంట ముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే తక్కువ ఆహారం తీసుకోవచ్చు.

* ఆయిల్ లో ఫ్రై చేసిన ఫిష్, చికెన్ లాంటివి తినకూడదు. బాయిల్ కాని రోస్ట్ కాని చేసినవి మాత్రమే తినాలి.

* ప్లాన్, ప్లాన్, ప్లాన్. మనం తీసుకునే ఆహారం ప్లానింగ్ ఉంటే బరువు పెరగటాన్ని నియంత్రించవచ్చు. మనం ఏ ఆహారం తీసుకుంటున్నామని కాదు ఎంత ఆహారం తీసుకుంటున్నామని ఆలోచించి తినాలి.