ముడతలు తొలగించి ముఖాన్ని అందంగా మార్చే హోం రెమెడీస్ ఇవే!

అందంగా కనిపించాలంటే మన చర్మం ఆరోగ్యంగా ఉండాలి. చర్మంపై చిన్నపాటి నల్లటి మచ్చ కనిపించినా అది మన అందాన్ని డ్యామేజ్ చేస్తుంది. చిన్న వయసులోనే మనల్ని ముసలివాళ్లలా చేసే ఫైన్ లైన్లు, ముడతలు, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వీటినుంచి బయటపడేందుకు సహజసిద్ధమైన పద్ధతులను పాటిస్తే మంచిది. మార్కెట్‌లో లభించే వివిధ రకాల సౌందర్య సాధనాలను ఉపయోగించవచ్చు. కానీ వాటి ప్రభావం తాత్కాలికమే. వాటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ నేచురల్ రెమెడీస్ చర్మ సౌందర్యాన్ని శాశ్వతంగా పెంచుతాయి. నాలుగు పదుల వయసులోనూ అందంగా కనిపించాలంటే ఈ హోం రెమెడీస్‎ను ఉపయోగించడం మంచిది.

గుడ్డులోని తెల్లసొన:

గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు మీ చర్మ ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. చర్మంపై వచ్చే ముడతలకు నేచురల్ రెమెడీ అని చెప్పవచ్చు.

-దీని కోసం మీరు ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొనను తీసుకొని నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు.

-మృదువుగా మసాజ్ చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

-ఇలా చేయడం వల్ల గుడ్లలో ఉండే ప్రొటీన్, విటమిన్ బి, విటమిన్ ఇ మీ చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఆలివ్ నూనె:

రాత్రి పడుకునే ముందు మీ చర్మంపై కొన్ని చుక్కల ఆలివ్ నూనెతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. తర్వాత టవల్ తో శుభ్రం చేసుకోవాలి. మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

నిమ్మరసం:

నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో చర్మంపై ముడతలను తొలగించే తత్వం ఉంటుంది. నిమ్మకాయను ముక్కలుగా చేసి, మీ ముఖంపై, చర్మం ముడతలు పడిన చోట మసాజ్ చేయండి. నిమ్మకాయలో మీ చర్మాన్ని మెరిసేలా చేసే ఆమ్ల గుణాలు ఉన్నాయి. అయితే నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించవద్దు.

కలబంద:

కలబందలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం యొక్క సాగే లక్షణాలను పెంచుతుంది. దీని కోసం మీరు కొంత అలోవెరా జెల్ ను తీసుకుని ముడతలు పడిన చర్మంపై అప్లై చేసి మసాజ్ చేయాలి.
15 నిమిషాలు ఆరనివ్వండి. ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. దీనిని విటమిన్ ఇ నూనెతో కూడా కలిపి ముఖానికి రాసుకోవచ్చు.

అరటిపండు:

ఆరోగ్యకరమైన ఆహారంలో, అరటి మన శరీరానికి పుష్కలంగా పోషకాలను అందిస్తుంది. దీన్ని చర్మంపై అప్లై చేయడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. బాగా పండిన అరటిపండును పేస్టులా చేసి చర్మం ముడతలు పడిన చోట రాయాలి. ఇలా దాదాపు అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి. అరటిపండులో కొద్దిగా ఆవకాడో, తేనె కలిపి రాసుకోవచ్చు.

క్యారెట్:

క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా చర్మంపై ముడతలను తొలగిస్తుంది. దీని కోసం మీరు క్యారెట్ పేస్ట్‌ను తయారు చేసి, ప్రతిరోజూ మీ ముఖానికి అప్లై చేయాలి. ఒకట్రెండు క్యారెట్లను తీసుకుని నీళ్లలో బాగా మరిగించి ఆ తర్వాత కాస్త తేనె కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి అరగంట ఆగి సాధారణ నీళ్లతో కడిగేస్తే ముఖంలో మెరుపు పెరుగుతుంది. ఇది కాకుండా, మీరు తరచుగా పచ్చి క్యారెట్లను తినడం అలవాటు చేసుకోవాలి.

పైనాపిల్:

మన చర్మ ఆరోగ్యానికి మేలు చేసే అన్ని అంశాలు పైనాపిల్ పండులో ఉంటాయి. మన చర్మం యొక్క తేమను పెంచడంతోపాటు మృతకణాలను తొలగించడం వరకు, పైనాపిల్ నుండి ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియ జరుగుతుంది . ఇది మన చర్మానికి ఫైబర్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను అందిస్తుంది. ఇది మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మంపై గీతలు మాయమవుతాయి. పైనాపిల్ ముక్కలను నేరుగా చర్మంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

ఎక్కువ నీరు త్రాగాలి:

నీరు ఎక్కువగా తాగడం వల్ల మన చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. డిహైడ్రేషన్ను తగ్గిస్తుంది. మన చర్మం మరింత తేమను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. రోజూ రెండు లీటర్ల నీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లకు చర్మంపై ముడతలు కనిపించవు.