పిల్లలు తెలివైన వారిగా ఉండాలంటే ప్రతి తల్లి చేయాల్సిన పనులివి..!

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు తెలివిగా ఉండాలని కోరుకుంటారు. అయితే పిల్లల చిన్నతనం చాలా వరకు తల్లి చుట్టూనే గడుస్తుంది. ఈ కారణంగా పిల్లలు ఏదైనా తప్పు చేసినా, లేదా అల్లరి చేసినా, పిల్లల నడవడిక తప్పుగా ఉన్నా.. వెంటనే తల్లినే నిందిస్తూ ఉంటారు చాలామంది. కానీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలన్నా, వారి నడవడిక చక్కగా ఉండాలన్నా ప్రతి తల్లి కొన్ని పనులు చేయాలి. ఆ పనులేంటో తెలుసుకుంటే..
లైబ్రరీ..
పిల్లలను లైబ్రరీకి తీసుకెళ్లడం లేదా ఇంట్లోనే మంచి పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు ఏదైనా చదువుతున్నప్పుడు చదివిన విషయం ద్వారా వారు ఏం అర్థం చేసుకున్నారు అడగాలి. ఇది పిల్లల ఆలోచన తీరును మారుస్తుంది.
కమ్యూనికేషన్..
పిల్లలు తెలివిగా మారాలంటే తల్లులకు ఓపిక చాలా ముఖ్యం. ప్రతి తల్లి పిల్లలతో చాలా ఓపెన్ గా మాట్లాడాలి. పిల్లలు చెప్పే విషయాన్ని చిరాకు పడకుండా శ్రద్దగా వినాలి. అలాగే పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాలి. పిల్లలను ప్రతి విషయంలో ప్రోత్సహించాలి. వారు చేసే ప్రతి మంచి పనిని మెచ్చుకోవాలి. పిల్లలు మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది.
పరిష్కారాలు..
పిల్లలకు కూడా చాలా సమస్యలు వస్తుంటాయి. అవన్నీ వారికి చాలా పెద్దవిగా, పెద్దలకు చాలా చిన్నవిగా అనిపిస్తుంటాయి. పిల్లలను ఇబ్బంది పెట్టకూడదని ప్రతిది తల్లిదండ్రులు చెప్పకూడదు. ముఖ్యంగా పిల్లల సమస్యలకు నువ్వేతై ఏం చేస్తావ్, ఎలా ఉంటే బాగుంటుంది వంటి ప్రశ్నలు వేసి పిల్లల సమస్యలకు పరిష్కారం వారే వెతుక్కునేలా చేయాల్సింది తల్లులే.
రోల్ మోడల్..
పిల్లలను రూలింగ్ చేయడం కాదు.. వారికి రోల్ మోడల్ గా ఉండాలి. పిల్లలు తమ పనులు తాము చేసుకోవడం, ప్రతి పనిని శ్రద్దగా చేయడం, ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండటం, పెద్దలు, ఇతరులతో గౌరవంగా మర్యాదగా మాట్లాడటం వారికి నేర్పాలి. పిల్లల స్వభావం చాలా భిన్నంగా ఉంటుంది. వారితో మాట్లాడేటప్పుడు వారి పెద్దతరం అనే గీత నుండి బయటకు వచ్చి వారితో సరదాగా కలిసిపోయి మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడే పిల్లలు పెద్దలు చెప్పినదాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరించగలరు.
పైన చెప్పుకున్న పనులన్నీ చేయగలిగితే ప్రతి తల్లి తమ పిల్లలను తెలివైన వారిగా మార్చడంలో తమ వంతు కృషి చేసినట్టే.
*రూపశ్రీ.


.webp)
.webp)