టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కూకు విత్ జాతిరత్నాలు...కార్తీకదీపం
on Jul 25, 2025

బుల్లితెర మీద ప్రసారమయ్యే షోస్ చాలా ఉన్నాయి. ఐతే రీసెంట్ గా జాయిన్ ఐన కొత్త షో కూకు విత్ జాతిరత్నాలు.. కుకింగ్ షో అన్నమాట. చాలా రోజుల తర్వాత ప్రదీప్ హోస్ట్ గా ఈ కుకింగ్ షో చేస్తున్నాడు. ఇక జడ్జెస్ గా సీనియర్ నటి రాధ, ఆశిష్ విద్యార్థి, చెఫ్ సంజయ్ తుమ్మ ఉన్నారు. ఇక బుల్లితెర నటులు జాతిరత్నాలుగా, సీనియర్ నటులేమో చెఫ్స్ గా ఈ షోలో ఉన్నారు. ఐతే ఈ షోస్ కి కూడా రేటింగ్స్ ఉంటాయి.
ఏ షో ఎంత రేటింగ్ తో టాప్ లో ఉందో స్టార్ మా రీసెంట్ గా అనౌన్స్ చేసింది. నాన్ ఫిక్షన్ షోస్ లో టాప్ 2 ప్లేసెస్ ని ఆక్రమించుకున్న షోస్ "కూకు విత్ జాతిరత్నాలు" ఉంది. ఈ షోకి రేటింగ్ 7 . 2 గా ఉంటే "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షో సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ షోకి రేటింగ్ 5 . 6 గా ఉంది. ఇక సీరియల్స్ విషయానికి వస్తే కార్తీక దీపం 14 .42 , గుండె నిండా గుడి గంటలు 13 . 11 , ఇంటింటి రామాయణం 12 . 92 , ఇల్లు ఇల్లాలు పిల్లలు, 12 . 36 , నువ్వుంటే నా జతగా 10 .62 , బ్రహ్మముడి సీరియల్ కి రేటింగ్ బాగా తగ్గిపోయింది 6 .96 గా ఉంది. ఇలా సీరియల్స్ రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి. కూకు విత్ జాతిరత్నాలు షోలో ప్రదీప్ కామెడీ అలాగే మద్యమద్యలో యాదమ్మ రాజు పెళ్లి కాన్సెప్ట్ ఈ వారం బాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక సీరియల్స్ పరంగా చూస్తే కార్తీక దీపం - 2 హవా కొనసాగిస్తోంది. ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో బాలు ఇటు సీరియల్ లోనూ అటు మిగతా షోస్ లో కనిపించడం శ్రీముఖి వలన బాలుకి మంచి హైప్ వస్తోంది. దాంతో అటు ఆ షో ఇటు ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



