చల్లటి బీరు తాగినంత హాయిగా ఉంది నీ వాయిస్...
on Jul 25, 2025
.webp)
పాడుతా తీయగా సీజన్ 25 కి సంబందించిన నెక్స్ట్ వీక్ ప్రోమోలో కీరవాణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే సునీత, చంద్రబోస్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సీనియర్ సింగర్ చిత్రమా పుట్టినరోజు సందర్భంగా సింగర్స్ కొంతమంది ఆమె పాటల్ని పాడారు. ఇందులో శ్రీనివాస్ దరిమిశెట్టి "హలో బ్రదర్" మూవీ నుంచి "అల్లరి కోయిల" సాంగ్ పాడాడు. చంద్రబోస్ ఈ సాంగ్ మీద కామెంట్ చేశారు. "కొంతకాలం పాటు జనాలందరినీ ఉర్రూతలూగించిన పాట ఇది" అన్నారు. ఇక సునీత ఐతే "అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాట ఏలుతూనే ఉంది" అన్నారు. ఇక ఇప్పుడు కీరవాణి అందుకున్నారు..
"చల్లటి బీరు తాగితే ఎంత హాయిగా ఉంటుందో అంతా హాయిగా ఉంది నీ వాయిస్" అన్నారు. శ్రీనివాస్ తెలుగు ఇండియన్ ఐడల్ లో 1st రన్నరప్ గా వచ్చాడు అలాగే చిరంజీవి చేతుల మీదుగా రెండు లక్షల కాష్ ప్రైజ్ తీసుకున్నాడు. సరేగమప 2018 లో 2nd రన్నరప్ గా నిలిచాడు. ఇక ప్రోమో చివరన కీరవాణి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "పాత్రికేయులు నన్ను.. నన్నంటే నన్ను కాదు అందరినీ పరభాషా గాయకులూ పాడుతున్నారు. ఎందుకు పరభాషా గాయకులు అంటున్నారు. పాడితే తప్పేంటి ? అది కాదు అడగాల్సిన ప్రశ్న" అంటూ కామెంట్ చేసారు. ఇక సింగర్ సునీత ఐతే "చిత్రమ్మ అలా వచ్చి నిల్చుంటే చాలు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. " అన్నారు. గత ఎపిసోడ్స్ లో ఈ షో జడ్జెస్ ఐన కీరవాణి, సునీత, చంద్రబోస్ మీద సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్స్ గురించి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



