Jayam serial : గంగని కాపాడిన రుద్ర.. తనని కిడ్నాప్ చేసింది ఎవరంటే!
on Jul 25, 2025
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ నెల పద్నాలుగున కొత్తగా మొదలైంది. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -13 లో..... రుద్ర బామ్మర్ది వీరు గంగని కిడ్నాప్ చేస్తాడు. తన భారీ నుండి గంగని రుద్ర కాపాడి ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తుంటే.. గుమ్మానికి ఉన్న పూలదండ వాళ్లపై పడుతుంది. రుద్ర చిరాకు పడుతుంటే.. వీరు వచ్చి అది తీసేస్తాడు. గంగని అలా ఎత్తుకొని తీసుకొని వస్తుంటే రుద్ర ఫ్యామిలీ టెన్షన్ పడతారు. గంగకి ఏమైందని అడుగుతారు. ఎవరో గంగని కిడ్నాప్ చేస్తే బావ కాపాడాడని ఏం తెలియనట్లు వీరు యాక్ట్ చేస్తాడు.
గంగ స్పృహలో లేకపోవడంతో డాక్టర్ ని పిలుస్తారు. గంగని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు బావ అని రుద్రతో వీరు అంటాడు. నా శత్రువులు అయిన అయి ఉండాలి లేక నా నాశనం కోరుకునేవారు అయి ఉండాలి.. అందుకే నా దగ్గర పనిచేసే తనని కిడ్నాప్ చేశారని రుద్ర అంటుంటే అది ఎవరైనా సరే నేను కనుక్కుంటానని వీరు అంటడు. వీరు పక్కకి వెళ్లి ప్లాన్ ఫెయిల్ చేశారని రౌడీలతో మాట్లాడతాడు. ఆ రుద్ర వస్తాడనుకోలేదు ఒక్కొక్కరిని బాగా కొట్టాడని ఆ రౌడీ చెప్తాడు. వీరు డిస్సపాయింట్ గా ఉంటే తన చెల్లి వచ్చి ఏదో ప్లాన్ ఫెయిల్ అయినట్లు ఉంది బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అంటుంది. మరోవైపు డాక్టర్ వచ్చి గంగని చెక్ చేసి ఏం పర్వాలేదు ఆని చెప్తాడు. గంగ స్పృహ లోకి వచ్చి.. నేనేంటి ఇక్కడున్నా అని అడుగుతుంది. నిన్ను ఎవరో కిడ్నాప్ చేశారు రుద్ర కాపాడాడని చెప్తారు.
నాకు గుర్తు వచ్చింది ఎవరో ఒకతను కొంతమంది అమ్మాయిలని తీసుకొని వెళ్తున్నాడు. ఆ కార్ నెంబర్ అంటూ గంగ గుర్తుచేసుకోబోతుంటే వీరు కంగారుపడుతూ.. గంగ మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు పదా డ్రాప్ చేస్తానని అంటాడు. నువ్వు వద్దు రుద్ర డ్రాప్ చేస్తాడని రుద్ర వాళ్ల నాన్న అంటాడు. గంగని ఇంటి దగ్గర తీసుకొని వెళ్తాడు రుద్ర. అప్పటికే గంగ కన్పించడం లేదని వాళ్ల అమ్మ ఏడుస్తుంటుంది. గంగ ని చూడగానే దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతుంది. గంగ వాళ్ల నాన్న రుద్ర దగ్గరికి వెళ్లి నా కూతురిని నువ్వు తీసుకొని వెళ్ళావంటూ తాగి వాగుతుంటే రుద్రకి కోపం వస్తుంది. రుద్ర కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో గంగ సూపర్ మార్కెట్ లో పని చేస్తూ ఉంటుంది. తను లేట్ గా లేవడంతో సూపర్ మార్కెట్ కి ఆలస్యంగా వెళ్తుంది. ఆ రోజే రుద్ర సూపర్ మార్కెట్ కి చెకింగ్ కి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



