మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని రాశారు దానికి బాధపడ్డా..జర్నలిస్టుల గొంతు నొక్కేస్తారా
on Jun 25, 2025
.webp)
ఫ్యామిలీ స్టార్ షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతోంది. ఎందుకంటే ఈ షోకి వీడియొ జాకీస్ వెర్సెస్ ఆడియో జాకీస్ విజెస్ వెర్సెస్ ఆర్జెస్ గా డిజైన్ చేశారు. ఇందులోకి దీప్తి నల్లమోతు, జాఫర్, శివజ్యోతి, వింధ్య విశాఖ, ఆర్జే సూర్య, చైతు, వంటి వాళ్లంతా వచ్చారు. ఐతే జాఫర్ ఎక్కడ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా సుధీర్ ని ఇంటర్వ్యూ చేసాడు. "ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి కదా.. బాగా బాధపెట్టిన రూమర్ ఏంటి" అని అడిగాడు. "ఇంట్లో వాళ్ళు చనిపోయారని ఏదో న్యూస్ రాశారు. మా డాడీకి ఫోన్స్ చేసి అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు బతికుండగానే లేరు అని రాయడం" చాలా బాధపెటింది అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు సుధీర్.
సుధీర్ చీకటి కోణం పేరుతో ఈ ప్రశ్నలు అడిగాడు జాఫర్. "సుధీర్ అంటే పెద్ద మానిప్యులేటెడ్...సినిమా ప్రాజెక్ట్స్ చేస్తూ మళ్ళీ బుల్లితెర మీద షోస్ చేయడం యూ టర్న్ లేదా " అంటూ ఒక ప్రశ్న వేశారు. "ప్రొఫెషనల్ లైఫ్ లో యూజ్ అయ్యి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ చేసిన ఆ అమ్మాయిది" అంటూ ఆపేసాడు. ఇంతకు జాఫర్ అడిగిన ఇన్ కంప్లీట్ ప్రశ్నలు ఏంటి వాటికి ఆన్సర్స్ సుధీర్ ఎం చెప్పాడో తెలియాలి అంటే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ప్రోమో స్టార్టింగ్ జాఫర్ చూసిన సుధీర్ "మీరెందుకు కొచ్చారు సర్" అని అడిగాడు. "ఏంటి జాఫర్ సర్ ని మీరెందుకు వచ్చారు అంటాడా..అంటే జర్నలిస్టుల గొంతుని ఇక్కడితో నొక్కేస్తున్నారా " అంటూ శివజ్యోతి రెచ్చిపోయింది. ఇక సుధీర్ ఐతే "ఇక ఇప్పటి నుంచి ఒక్కటే దొరికిన దాన్ని తురుముదాం దొరకని దాన్ని తరుముదాం" అన్నాడు. దానికి జాఫర్ "సుధీర్ ఇన్ని డబుల్ మీనింగులా..డీకోడ్ చేయలేకపోతున్నా" అంటూ కౌంటర్ వేసాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



