Illu illalu pillalu : నిజాలు చెప్పిన నర్మద వాళ్ళ నాన్న.. షాకైన ఇన్విజిలేటర్!
on Jun 25, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -193 లో.... సాగర్, నర్మద కలిసి నర్మద వాళ్ళింటికి వెళ్తారు. నర్మద వాళ్ళ నాన్నకి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పాలనుకుంటుంది. అయితే నర్మద ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ నాన్న కోపంతో రగిలిపోతుంటాడు. లేచిపోయి ఇప్పుడు వచ్చి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తే అన్నీ మర్చిపోతాననుకుంటున్నావా అంటూ నర్మదని కోప్పడతాడు వాళ్ళ నాన్న. నీ అప్పుడు ఏం చేస్తున్నాడని ఎవరైనా అడిగితే రైస్ మిల్ లో మూటలు మోస్తాడని చెప్పాలా.. మీ ఆఫీస్ లో నీ భర్త ఏం చేస్తాడంటే ఏం సమాధనం చెప్తావని వాళ్ళ నాన్న నర్మదని నిలదీస్తాడు. తను మౌనంగా ఉండిపోతుంది. ఇక కాసేపటికి నర్మద, సాగర్ ఇద్దరూ ఒకచోటకి చేరుకుంటారు. తన నాన్న అన్న మాటలకి నర్మద కన్నీటి పర్యంతం అవుతుంది. సాగర్ ఓదారుస్తుంటాడు.
మరోవైపు ఎగ్జామ్ హాల్ దగ్గర ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫ్రెండ్స్ వచ్చి.. టైమ్ అవుతుంది రావే అని అన్నా కూడా.. మీరు వెళ్లండే ధీరజ్ వచ్చిన తరువాత వస్తానని అతని కోసమే ఎదురుచూచ్తుంది. రేయ్.. టైమ్ అవుతుంది రారా బాబూ అని ప్రేమ అనుకుంటుంది. ఇంతలో ధీరజ్ సైకిల్‌పై హడావిడిగా వస్తాడు. ఏంటే.. ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యిందా ఏంటీ.. బయట దిష్టిబొమ్మలా ఎదురుచూస్తున్నావని ధీరజ్ అంటాడు. రేయ్ సచ్చినోడా.. ఎగ్జామ్ రోజున కూడా ఆలస్యంగానే వస్తావా.. తొందరగా రావాలని తెలిసి చావదా అని ప్రేమ అంటుంది. ఎహే.. ఫుడ్ డెలివరీ ఇచ్చేసి వస్తున్నానని ధీరజ్ అంటాడు. ఎగ్జామ్స్ రోజున కూడా ఫుడ్ ఆర్డర్స్ ఏంట్రా అని ప్రేమ అంటే.. డ్యూటీకి డుమ్మా కొడితే రేటింగ్ తగ్గుతుంది.. దాంతో కంపెనీ వాడు ఆర్డర్స్ తక్కువ ఇస్తాడు.. మా బాధలు మాకు ఉన్నాయ్.. నీకేంటిలే అని ధీరజ్ అంటాడు.
అవునా అని ప్రేమ అనగానే సర్లే చేసిన ల్యాగ్ చాలు కానీ.. పదా అని ధీరజ్ అంటాడు. దాంతో కంగారుగా ఇద్దరూ కలిసి ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు వెళ్తారు. ధీరజ్ కనీసం ఎగ్జామ్ రాయడానికి పెన్ కూడా తెచ్చుకోకపోవడంతో.. నీ గురించి తెలిసేరా.. పెన్ తీసుకొచ్చానని చెప్పి తీసుకోమని ఇస్తుంది. నా గురించి బాగానే స్టడీ చేశావే అని ధీరజ్ అంటే.. కలిసి ఉంటున్నాం కదా.. ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అని ప్రేమ అంటుంది. టెన్షన్ పడకుండా ఎగ్జామ్ బాగా రాయి.. 90 పర్సెంట్ రావాలని ప్రేమ అంటుంది. నా గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావ్.. నాకంత సీన్‌లేదని ధీరజ్ అంటాడు. రేయ్ కనీసం పాస్ అవ్వరా.. లేదంటే పరువు పోతుందని ప్రేమ అంటుంది. అది ఎగ్జామ్ రాసిన తరువాత తెలుస్తుందని ధీరజ్ అంటాడు. ఎగ్జామ్ హాల్‌లో ధీరజ్ ఏమీ రాయలేకపోతుంటాడు. రేయ్ ఏదోటి రాయరా.. గుర్తు తెచ్చుకోరా అని ప్రేమ అంటుంది. ఏమీ గుర్తుకి రావడం లేదని ధీరజ్ అనడంతో.. ఇదిగో రాసుకోమని ప్రేమ తన పేపర్‌ని ఇస్తుంది. ఇంతలో ఇన్విజిలేటర్ చూస్తాడు. ఇద్దరి పేపర్లను ఇన్విజిలేటర్ తీసుకుని చూసి షాక్ అవుతాడు. అయితే ప్రేమ పేపర్‌ని చూసి ఇన్విజిలేటర్‌తో పాటు ధీరజ్ కూడా షాక్ అవుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



