ENGLISH | TELUGU  
Home  » TV News

ఏటిఎం ట్రైనర్ గా శ్రీవిష్ణు

on May 6, 2023

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రతీ వారం లాగే నెక్స్ట్ వీక్ కూడా నవ్వించడానికి సిద్ధమైపోయింది. ఇక ఈ షో ప్రోమో రీలీజ్ అయ్యింది. ఈ రాబోయే ఎపిసోడ్ కి శ్రీవిష్ణు, రెబమోనికాజాన్ హీరో హీరోయిన్స్ గా నటించిన మూవీ "సామజవరగమన" మూవీ టీం వచ్చింది. ఈ మూవీ మే 18 న రిలీజ్ కాబోతోంది. ఇందులో రాంప్రసాద్ ఏటిఎం సెక్యూరిటీ గార్డ్ గా ఒక స్కిట్ వేసాడు. అందులో శ్రీవిష్ణు కూడా కొన్ని కామెడీ బిట్స్ చేసి నవ్వించాడు. ఒక కమెడియన్ వచ్చి మిగిలిపోయిన ఆహారపదార్థాలు తీసుకొచ్చి ఎటిఎంలో పెట్టేసరికి ఇదేంటని అడిగాడు రాంప్రసాద్. "మా ఇంట్లో ఫ్రిజ్ లేదు కదా..ఈ ఎటిఎం సెంటర్ లో ఏసీ ఉంటుంది కదా రేపటి వరకు పాడవకుండా ఉంటాయి" అనేసరికి అవాక్కయ్యాడు రాంప్రసాద్.

ఇంతలో శ్రీవిష్ణు వీళ్ళ టీమ్ దగ్గరకు వచ్చి "మీకు ఎటిఎం కార్డులు పెట్టడం తియ్యడం ఎలాగో నేర్పమని గవర్నమెంట్ నన్ను పంపించింది" అనేసరికి "ప్రూఫ్ ఏమిటి" అని రాంప్రసాద్ అడగడంతో ఆధార్ కార్డు చూపించాడు శ్రీవిష్ణు. "ఆధార్ కార్డు ఎవరిస్తారు గవర్నమెంట్ కదా" అనేసరికి అందరూ నవ్వేశారు. "ఇంతకు మీరేం చేస్తుంటారు" అని రాంప్రసాద్ శ్రీవిష్ణుని అడిగాడు. "ఎండాకాలంలో వడదెబ్బ తగులుతూ ఉంటుంది కదా ఆ వడలు నేనే వేస్తూ ఉంటాను" అనేసరికి రాంప్రసాద్ నవ్వేసాడు. ఇక ఇందులో ప్రేమిస్తే, బొమ్మరిల్లు మూవీ స్పూఫ్స్ కూడా చేశారు కొన్ని టీమ్స్. లాస్ట్ లో రాకింగ్ రాకేష్ స్విమ్మింగ్ పూల్ దగ్గర సమ్మర్ స్పెషల్ కిట్ వేసాడు.

"ఈత ఎందుకు నేర్చుకుందామని అనుకుంటున్నావు" అని రాంప్రసాద్ ని రాకేష్ అడిగేసరికి "నా చిన్నప్పుడు మా అమ్మ పాలప్యాకెట్లు కావాలి కొట్టుకుపో అంది...మా నాన్నకు అర్ధం కాక నీటిలో కొట్టుకుపోయాడు. అదే స్విమ్మింగ్ వచ్చి ఉంటే నేను కాపాడేవాడిని కదా" అని చెప్పాడు. మరి "నీకు స్విమ్మింగ్ అంటే భయం" అన్నావ్ అని రాకేష్ అడిగేసరికి "అందుకే కదా తాయెత్తు తెచ్చుకున్నా" అని చూపించాడు రాంప్రసాద్..దానికి అవాక్కయ్యాడు రాకేష్.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.