అమ్మ విలువ తెలిసేలా చెప్పిన జగతి!
on May 6, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -755 లో... జగతి దగ్గరికి శైలేంద్ర వచ్చి.. "ఏంటి పిన్ని మీరు.. మిమ్మల్ని అమ్మ అని పిలవడం ఇష్టం లేని రిషి మీద.. మీకు ఎందుకంత ప్రేమ" అని శైలేంద్ర అంటాడు. దానికి జగతి చెంప పెట్టులాగా స్ట్రాంగ్ గానే ఆన్సర్ ఇస్తుంది. "కన్నకొడుకు మీద ప్రేమ ఎందుకంటే ఎవరైనా ఏం చెప్తారు శైలేంద్ర. నువ్వు ఒక ఆడదానివయ్యి, నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి ఒక బిడ్డకు జన్మ ఇచ్చినప్పుడు నీకు తెలిసేది ఆ తల్లి విలువ, ఒక తల్లి బిడ్డని ఎంత ప్రేమిస్తుందో. అయినా రిషి నాతో మొదటగా మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అలాంటిది నాతో మాట్లాడాడు. నేను ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను. నాతో రిషి ప్రేమగా మాట్లాడుతున్నాడు" అంటూ జగతి శైలేంద్రతో అంటుంది.
ఆ తర్వాత శైలేంద్ర మాటలు గుర్తు చేసుకుంటూ జగతి బాధపడుతుంది. రిషికి ఏదో కీడు తలపెడుతున్నాడని జగతి భయపడుతుంది. మరొకవైపు, నాకు చాలా హ్యాపీగా ఉంది.. అందరు రిషిని పోగొడుతుంటే నాకు గర్వంగా ఉందని జగతితో మహేంద్ర అంటాడు. జగతి డిస్టర్బ్ గా ఉండటం గ్రహించిన మహేంద్ర. ఏంటి జగతి అలా ఉన్నావని అడుగుతాడు. తలనొప్పిగా ఉంది మహేంద్ర అని జగతి చెప్పగానే.. సరే నేను వసుధార తో కాఫీ పంపిస్తానని చెప్పి మహేంద్ర వెళ్తాడు. ఆ తర్వాత వసుధార కాఫీ తీసుకొని రాగానే.. వసుధార ఆ డోర్ క్లోజ్ చేసి రా అని జగతి అంటుంది. అలా అనగానే డోర్ క్లోజ్ చేసి మాట్లాడేంత మాటలు ఏం ఉన్నాయ్ మేడం అని వసుధార అడుగుతుంది. ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉన్నప్పుడు అలానే మాట్లాడుకోవాలని జగతి అంటుంది.
రిషిని జాగ్రత్తగా చూసుకో వసు.. ఎప్పుడూ తనని ఓ కంట కనిపెడుతూ ఉండమని జగతి అనగానే.. ఏంటీ మేడం ఏమైందని వసుధార అడుగుతుంది. శత్రువులు రిషికి ఏ వైపు నుండి అపాయం తలపెడతారో అని భయమేస్తుందని జగతి ఏడుస్తుంది. మీరేం టెన్షన్ పడకండి.. రిషి సర్ మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్ళకి చెడ్డవాడు.. అయినా రిషి సర్ ని నేను చూసుకుంటానని వసుధార అంటుంది.
జగతి, రిషి గురించి బాధపడడం అంతా ఎమోషనల్ గా సాగుతుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయానిలు కలిసి రిషిని ఎలా దెబ్బ కొట్టాలని కుట్ర చేస్తుంటారు. మన ప్లాన్ ని పిన్ని పసిగట్టిందేమోనని అనుమానంగా ఉందని దేవయానితో శైలేంద్ర అంటాడు. దానితో జాగ్రత్తగా ఉండాలి.. గొప్ప తెలివితేటలు గలది.. మనిషిని కంటిచూపుతో తెలుసుకుంటుంది. చిన్నప్పుడే రిషికి జగతిని దూరం చేస్తే.. ఇప్పుడు మళ్ళీ దగ్గరయిందని దేవయాని అంటుంది. అప్పుడే ధరణి కాఫీ తీసుకొని వస్తుంది. ఇదంతా విందా అనుకుని ఇద్దరు భయపడుతారు కానీ ధరణి మాత్రం ఏం వినదు. ఆ తర్వాత ధరణిని ఇద్దరు కలిసి తమ సూటిపోటి మాటలతో తిడతారు. ఆ తర్వాత ధరణి బాధపడుతూ వాళ్ళని ఏమీ అనలేక అక్కడ నుండి వచ్చేస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



