ENGLISH | TELUGU  
Home  » TV News

మరోసారి 'లైగర్' ఫాన్స్ కి, అనసూయకి మధ్య లొల్లి!

on May 6, 2023

సోషల్ మీడియాలో అనసూయని "ఆంటీ" అని పిలవడం, దానికి ఆమె ఫైర్ అవడం.. చివరికి నెటిజన్స్ కి, అనసూయకి మధ్యలో మాటల యుద్ధం గురించి తెలుసు. ఆ తర్వాత 'ఆంటీ' అనే హాష్ టాగ్  సోషల్ మీడియాలో ఎంత కాక రేపిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ రచ్చకి ఎక్కడా ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇప్పుడు మళ్ళీ ట్విట్టర్ లో గొడవ చెలరేగింది. దీనికి కారణం అనసూయ చేసిన పోస్ట్.

విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న "ఖుషి" మూవీ గురించి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే అందులో విజయ్ దేవరకొండ పేరును 'ది విజయ్ దేవరకొండ'గా ప్రస్తావించారు. దాన్ని ఉద్దేశించి అనసూయ తన ట్విట్టర్ అకౌంట్ లో "ఇప్పుడే ఒకటి చూసాను.."ది" నా బాబోయ్... పైత్యం..మనకు అంటకుండా చూసుకుందాం" అని పోస్ట్ చేసేసరికి రౌడీ ఫాన్స్ దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా రెచ్చిపోయారు. వాళ్ళ కామెంట్స్ కి కూడా అనసూయ కూడా గట్టిగానే  కౌంటర్ ఇచ్చింది. 

"భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ ఊప్స్.. బంగారు కొండలంట. ఎక్కడో అక్కడ నేను నిజం అనే విషయాన్ని  ప్రూవ్ చేస్తూనే ఉన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు" అని ట్వీట్ చేసింది. దీనిపై కొంతమంది "ఐనా ఫాన్స్ ని ఎందుకు కెలకడం..సొసైటీలో చాలా సమస్యలు వున్నాయి కదా.. వాటి మీద ఫోకస్ చేయండి. అసలు ట్వీట్ పెట్టి రెచ్చగొట్టడం ఎందుకు" అని ట్వీట్స్ చేస్తున్నారు.

ఐతే విజయ్ దేవరకొండ మీద అనసూయ ఎప్పుడూ ఫైర్ అవుతూనే ఉంటుంది. 'అర్జున్ రెడ్డి' మూవీ టైములో కూడా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటల మీద బాగా భగ్గుమంది అనసూయ. మహిళల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారంటూ ఫైర్ అయ్యింది. ఆమె మాటలకు రౌడీ ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో అనసూయని మీమ్స్ తో బాగా ట్రోల్ చేసేసారు. వాళ్ళ మీద అనసూయ కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది. ఇక ఈ ట్రోలింగ్ ఎన్ని రోజులు నడుస్తుందో...ఈ పోస్ట్ మీద లైగర్ ఎలా స్పందిస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.