అన్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ తో జనాల్ని మాయ చేసింది పాడుతా తీయగా సీజన్
on Jun 26, 2025

సింగర్ ప్రవస్తి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా ఆమె రెండు వీడియోస్ రిలీజ్ చేసింది. పాడుతా టీయగా షోలో తన ఎపిసోడ్ లో అసలు సునీత, చంద్రబోస్, కీరవాణి లేరు అంటూ చెప్పుకొస్తూనే ఉంది. ఆ ఎపిసోడ్ కచ్చితంగా చూడండి మీకే నిజం తెలుస్తుంది అంటూ ఆడియన్స్ కూడా చెప్పింది. ఐతే రీసెంట్ గా ప్రసారమైన ప్రవస్తి ఎపిసోడ్ చూస్తే అందులో జడ్జెస్ ముగ్గురూ కూర్చుని చప్పట్లు కొడుతూ కనిపించారు. దీంతో ఆడియన్స్ కి డౌట్ రావడంతో ప్రవస్తి మరో వీడియోని రిలీజ్ చేసింది. ఇదంతా అన్ ఎథికల్ గా ఎడిటింగ్ చేసి లేనిది ఉన్నట్టు చూపించారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఎపిసోడ్ చూసాక తానే షాక్ కి గురైనట్టు చెప్పింది. "రియాలిటీ షో హిస్టరీలో ఇంత అన్ ఎథికల్ గా , అన్ ప్రొఫెషనల్ గా కంప్రెస్ చేసి ఈ వీడియో ఇలా వదులుతారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
అందులో అది ఈటీవీ. అందులో ఇలాంటివి జరుగుతాయని నేను అస్సలు అనుకోలేదు. కంప్రెస్ చేసి ఎడిట్ చేసి ఎక్కడిదో తీసుకొచ్చి క్లిప్స్ అతికిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా. చాలా ఎడిట్ చేసినట్టు అనిపించింది అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. చంద్రబోస్ గారు కొంచెం సేపు కూడా లేరు. కీరవాణి గారు నాకేం సంబంధం లేదు అని లేచి వెళ్లిపోయారు. కీరవాణి గారివి ఎక్కడివో క్లాపింగ్ షాట్స్ వచ్చాయి. అవి ఎక్కడివో నాకు తెలీదు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో నలుగురిలో నేను రేణు కుమార్ అన్న ఇద్దరమే మిగిలాం. ఏ జడ్జ్ ఎంత స్కోర్ ఇచ్చారు, ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అన్న క్లారిటీ కూడా ఏమీ ఇవ్వలేదు. మీరు కూడా ఆలోచించండి ఇంకేదైనా రియాలిటీ షోలో ఇలాగే చూసారు. ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం నేను నవ్వుకుంటూనే ఉన్నాను. ఈ సీజన్ ఇంత ఘోరంగా జరుగుతున్నప్పుడు నేను ఇంకా వదిలేసాను. ఆడియన్స్ కి అర్థమవుతుందని నేను అనుకున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. జనాల్ని ఇంత ఈజీగా ఫూల్స్ చేస్తారనుకోలేదు. ఎవరి మీద ఎలాంటి పర్సొనల్ గ్రజ్ లేదు. ఒక వేళా ఈ సీజన్ లో ఎవరైనా విన్ అయ్యుంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. ఇక ఆ విన్నర్ కూడా ఆ నచ్చిన వాళ్ళే అవుతారు." అంటూ చెప్పుకొచ్చింది ప్రవస్తి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



