llu illalu pillalu : ధీరజ్ కోసం ప్రేమ త్యాగం.. నర్మద షరతు అదే!
on Jun 26, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -194 లో.....నర్మద, సాగర్ ఇద్దరిని నర్మద వాళ్ళ నాన్న అవమానించి పంపిస్తాడు. నేను ఒక జాబ్ చేసున్నాను.. నువ్వు కూడా ఏదైనా జాబ్ చేస్తే గౌరవంగా ఉంటుంది కానీ ఇలా మీ నాన్న దగ్గర రైస్ మిల్ లో పని చేస్తున్నావని నర్మద అనగానే నిన్ను పెళ్లి చేసుకోక ముందే ఈ విషయం నీకు తెలుసు కదా అని సాగర్ అంటాడు.
తెలుసు ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావో అని పెళ్లి చేసుకున్నానని నర్మద అంటుంది. మరొకవైపు ప్రేమ, ధీరజ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు. ప్రేమ ఎగ్జామ్ బాగా రాస్తుంటే ధీరజ్ కి అందులో ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం తెలియదు. దాంతో దిక్కులు చూస్తుంటే ప్రేమ తను రాసింది చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇన్విజిలేటర్ చూసి ఇద్దరి పేపర్లు తీసుకుంటాడు. ముందే ప్రేమ పేపర్ పై ఐ లవ్ యూ అని రాస్తుంది. తను మా హస్బెండ్ సర్ మాకు గొడవ అయింది. అందుకే ఇలా పేపర్ పై రాసి తనకి చూపిస్తున్నానని ప్రేమ కవర్ చేస్తుంది. ఆ తర్వాత వేదవతి తన పుట్టింటి వంక చూస్తుంటుంది. ఎక్కడికి వెళ్లారు. అసలు ఎవరు కన్పించడం లేదని వేదవతి అనుకుంటుంది. అప్పుడే రామరాజు వస్తాడు. ఏంటి మీ పుట్టింటి వంక చుస్తున్నావని అడుగుతాడు. మా వాళ్ళు కన్పించడం లేదని వేదవతి అంటుంది. మీ తమ్ముడున్నాడు కదా వాడిని అడుగమని రామరాజు అంటాడు.
ఆ తర్వాత ధీరజ్ గురించి రామరాజు మాట్లాడతాడు. వాడు ఆ ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా అని వేదవతితో రామరాజు అంటాడు. ఆ తర్వాత ప్రేమ ఇక ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ఏంటని తన ఫ్రెండ్స్ ప్రేమని అడుగుతారు. గవర్నమెంట్ కాలేజీ అని ప్రేమ అనగానే.. అదేంటి అబ్రాడ్ వెళ్ళాలని నీ డ్రీమ్ కదా అని తన ఫ్రెండ్స్ అనగానే ఫైనాన్సియల్ గా కొంచెం ప్రాబ్లమ్ ఉందని ప్రేమ అక్కడ నుండి వెళ్లిపోతుంది. అదంతా ధీరజ్ వింటాడు. తరువాయి భాగంలో ఊళ్ళో దొంగలు పడుతున్నారట అని తిరుపతి వచ్చి రామరాజుకి చెప్తాడు. అయితే ఇంట్లో ఉన్న డబ్బు నగలు లాకర్ లో పెట్టండి అని రామరాజు అనగానే.. శ్రీవల్లి నగలు తీసుకొని రా అని వేదవతి అడుగుతుంది. దాంతో శ్రీవల్లి కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



