హమ్మయ్యా దేవుడా థ్యాంక్యూ..వీసా వచ్చింది.. శివ్ తో కలిసి ఇక యూఎస్ వెళ్లొచ్చు
on Jun 26, 2025
.webp)
బుల్లితెర మీద ప్రియాంక జైన్, శివ్ గురించి తెలియని వాళ్లుండరు. వీళ్ళు కలిసి సీరియల్స్ లో, షోస్ లో నటిస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా ప్రియాంక ఒక వీడియోని తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. యూఎస్ వీసా కోసం ఎంతో ట్రై చేస్తోందని ఫైనల్ గ వీసా వచ్చిందంటూ ఆనందంతో గంతులేసింది. ఐతే వీసా గురించి మూడు ప్రశ్నలు అడిగారు శివ్ తో కలిసి యూఎస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు చెప్తాను అంటూ చెప్పింది. దేవుడికి కూడా థాంక్యూ చెప్పింది ప్రియాంక. ఇక ముంబైలోని బ్యాండ్ స్టాండ్ మీదగా వెళ్తూ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇళ్ళు ఇవే అంటూ కార్ లో వెళ్తూ చూపించింది. ఫ్యూచర్ లో ఇలాంటి ఒక ఇల్లు ఇక్కడ ముంబైలో ఉండాలని అది షారుఖ్ ఖాన్ ఇంటి కంటే పెద్దగా ఉండాలని చెప్తూ "శివ్ ప్లీజ్ నాకు అంత పెద్ద ఇల్లు ఒకటి కావాలి" అంటూ అడిగింది.
ముంబై వచ్చాక అందులోనూ మన్నత్ ప్లేస్ కి వచ్చాక సూపర్ గా అనిపిస్తుంది అని చెప్పింది. ఇక పిన్నితో కలిసి డేట్ కి వెళ్ళింది అలాగే బీచ్ కూడా వెళ్ళింది ప్రియాంక. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వీసా అప్రూవ్ అయ్యింది అని చెప్పింది. తర్వాత ఫుడ్ తినేసి షాపింగ్ చేసింది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళ రెలెటివ్స్ ని పిల్లలని చూపించింది. వాళ్ళ అమ్మను చూపించింది. ఆమె పావురాళ్లకు మేత వేస్తూ కనిపించింది. అలాగే వాళ్ళ అత్తగారింటికి కూడా వెళ్ళింది. ఇక అక్కడ అందరికీ బై చెప్పేసి హైదరాబాద్ వచ్చేసింది ప్రియాంక జైన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



