ENGLISH | TELUGU  
Home  » TV News

బ్రహ్మముడి రుద్రాణి కాలి దుమ్ము కూడా విలువైనదేనంట! 

on May 21, 2023

షర్మిత గౌడ.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ రుద్రాణి పేరు వింటే స్టార్ మా టీవీ ప్రేక్షకులకి ఇట్టే తెలిసిపోతుంది. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ లో రాజ్(మానస్) కి మేనత్త రుద్రాణి గా షర్మిత గౌడ నటిస్తుంది. రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ ఇప్పుడు తెలుగు సీరియల్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. బ్రహ్మముడి సీరియల్ ఎంత ఫేమస్ అయిందో రుద్రాణి పాత్రలో షర్మిత గౌడ అంత పాపులర్ అయిందని అందరికి తెలిసిన విషయమే. 

బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ కి మేనత్తగా చేస్తున్న షర్మిత.. లేడీ విలన్ గా అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ లో రుద్రాణి, తన కొడుకు రాహుల్ కి ఒక గొప్పింటి సంబంధం తేవాలని తపిస్తుంది. అయితే రుద్రాణి లేడి విలన్ గా రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ మీద టైం దొరికనిప్పుడల్లా ప్రతీకారం తీర్చుకుంటుంది. అందుకే తనేం మాట్లాడినా దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవ జరుగుతూనే ఉంటుంది. అలా ఒకరికొకరికి గొడవలు పెడుతూ మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది రుద్రాణి.

అయితే రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ సీరియల్ లో కనిపించే శైలికి బయట ఉండేదానికి చాలా తేడా ఉంది.  కొన్నిరోజుల క్రితం సమ్మర్ వెకేషన్ కి వేరే దేశం వెళ్ళి అక్కడ స్విమ్ డ్రెస్ లో ఫోటోలు దిగి వాటిని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది షర్మిత గౌడ. అయితే సీరియల్ లో చీరకట్టుతో సంప్రదాయంగా కనిపించే రుద్రాణి.. బయట అలా కనిపించడంతో అప్పుడు తను చేసిన ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే తాజాగా తన అభిమాని ఒక ఫోటోని షర్మిత గౌడకి ట్యాగ్ చేసాడు. తన కాలికి  ఉన్న దుమ్ము కూడా విలువైనదే.. ఎప్పుడు తనకి దగ్గరగా ఉండాలని ఉందని ఆ ఫోటోకి క్యాప్షన్ గా ఆ అభిమాని రాసాడు. దాంతో ఆ పోస్ట్ చూసి గొప్పగా భావించిన షర్మిత గౌడ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో  షేర్ చేసింది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.