ENGLISH | TELUGU  
Home  » TV News

 మా రిలేషన్ ని మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్లంతా యాక్సెప్ట్ చేశారు

on May 22, 2023

సిక్స్త్ సెన్స్ సీజన్ 6 ఈ వారం ట్రెండింగ్ కపుల్ ని తీసుకొచ్చాడు. వాళ్లే "మళ్ళీ పెళ్లి" మూవీ హీరోహీరోయిన్స్ నరేష్, పవిత్ర. ఇందులో నరేష్ ని కొన్ని ఇంటరెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాడు ఓంకార్. "మీ రిలేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది" అని అడిగాడు.  "12 ఏళ్ళ కింద ఆలయం అనే మూవీలో కలిసి నటించాం. కానీ ఒకళ్ళతో ఒకళ్ళం అస్సలు మాట్లాడుకోలేదు. ఒకసారి ఎంఎస్ రాజుగారు హ్యాపీ వెడ్డింగ్ ఫిలింకి నన్ను బుక్ చేశారు. అప్పుడు నా పక్కన ఎవరు అని అడిగాను..పవిత్ర లోకేష్ అని చెప్పారు  ఆమేనా అనుకున్నా..ఎందుకంటే ఆమె ఎప్పుడు బుక్ చదువుకుంటూ తన లోకంలో తాను ఉంటుంది అనుకున్నా. మా ఇద్దరితో కలిపి ఫస్ట్ షూట్ జరిగింది. ఇద్దరం ఒకరికి ఒకరం విష్ చేసుకున్నాం.

ఆ రోజంతా మేం బాగా పరిచయం వున్న వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక రోజు నాకు కొంచెం దూరంలో కూర్చుకుని అప్పుడు ఫ్యాన్ నుంచి గాలి వస్తోంది. అప్పుడు నీ ఫ్రెగ్రెన్స్ నచ్చింది అని చెప్పాను. ఆ సినిమా ఐపోయింది. వెళ్లిపోయేటప్పుడు నీ నంబర్ ఇస్తావా అని అడిగాను.. కానీ చాలా రోజులు మాట్లాడుకోలేదు. ఈ అమ్మాయికి చాలా పొగరు అనుకున్నా అప్పుడు..అప్పుడు సమ్మోహనం మూవీలో పవిత్రని తీసుకున్నారు ఇంద్రగంటి గారు అప్పుడు ఈ అమ్మాయి మళ్ళీ దొరికింది అనుకున్నా. అప్పుడు అనుకోకుండా బెంగుళూరులో ఒక షూట్ కోసం వెళ్లి ఒక హోటల్ లో ఉన్నా..అప్పుడు నేను కాఫీకి కలుద్దామా అని అడగడం ఆమె ఒప్పుకోవడం అలా ఇద్దరం వెళ్లి కాఫీ తాగాం తర్వాత లంచ్ చేసాం మళ్ళీ ఈ సమ్మోహనం మూవీలో కలిసాం అని మా జీవితాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అలా 2017 డిసెంబర్ 31 న కేక్ కట్ చేసి ప్రొపోజ్ చేసుకున్నాం.

ఈ రోజుల్లో ఒక గుడ్ పర్సన్ దొరకడమే చాలా గొప్ప విషయం..కానీ నాకు అలాంటి గుడ్ పర్సన్ దొరికింది. ఇద్దరం కలిసి ఎన్నో ప్లేసెస్ చూసాం. అందులో ఈజిప్ట్ అంటే మాకు ఇష్టం. మా రిలేషన్ ని మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్లంతా యాక్సెప్ట్ చేశారు " అని చెప్పారు నరేష్.."మళ్ళీ పెళ్లి మూవీలో చేశారు కదా..మరి మీ పెళ్లి ఎప్పుడు" అని అడిగేసరికి "మేము లివ్ ఇన్ టుగెదర్ కాదు లవింగ్ టుగెదర్...పెళ్లి అంటే ప్రేమ, నమ్మకం ఉండేదే కదా..ఆ రెండు లేనప్పుడు వెళ్లేందుకు..మా ఇద్దరి మధ్య ఈ రెండూ ఉన్నాయి...ఇక మాకు వెళ్లేందుకు" అని చెప్పారు పవిత్ర.

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.