ENGLISH | TELUGU  
Home  » TV News

తను చేస్తున్న కొత్త సినిమా గురించి ముందే చెప్పేసిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!

on May 21, 2023

ఇమ్మాన్యుయేల్.. జబర్దస్త్ షో ద్వారా తన కామెడీతో తెలుగు టీవి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. జబర్దస్త్ లో మొదట వర్షతో కలిసి లవ్ ట్రాక్ నడిపిన ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు అదంతా జబర్దస్త్ షో కోసమే అన్నట్టుగా చేస్తున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో జబర్దస్త్ స్టేజ్ మీద చేసిన ప్రతీ స్కిట్ దాదాపు హిట్ అయిందనే చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఎంతో మంది కమెడియన్స్ తమని తాము మరింత నిరూపించుకోవడానికి సినిమాల్లోకి వెళ్తున్నారు. 

అంతకముందు జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టున్న వేణు వెల్దండి.. 'బలగం' మూవీతో దర్శకుడిగా మారి సూపర్ సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా సుడిగాలి సుధీర్ మొదట్లో కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేసినా పేరు రాకపోవడంతో.. హీరోగా తన రూట్ మార్చుకున్నాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు లాంటి సినిమాలు సుధీర్ బ్రాండ్ ని నిరూపించాయి. ముఖ్యంగా గాలోడు సినిమా టాక్ తో సంబంధం లేకుండా మాస్ సెంటర్స్ లో మంచి వసూళ్లు రాబట్టింది. సుధీర్ హీరోగా తనని తాను నిరూపించుకోవడానికి ఒక అడుగువేశాడని జబర్దస్త్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు అదే కోవలోకి ఇమాన్యూయల్ చేరాడు. జబర్దస్త్ షోలో నిన్న మొన్నటి దాకా బుల్లెట్ భాస్కర్ టీంలో ఒక మెంబర్ గా చేసిన ఇమ్మాన్యుయేల్ తాజాగా టీం లీడర్ అయ్యాడు. ఇప్పుడు అతను ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. ఇటీవల 'విరూపాక్ష'లో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇమ్మాన్యుయేల్ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు రీల్స్ చేస్తూ తనలోని కామెడీని అక్కడ కూడా నిరూపించుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా తను ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చన్' అంటూ అభిమానులతో ముచ్చటించాడు.  అందులో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రశ్నలు వేయగా వాటికి సూటిగా సమాధానమిచ్చాడు ఇమ్మాన్యుయేల్. మీరు ఈ స్టేజ్ కి రావడానికి కారణం ట్యాలెంట్ అంటారా? లేక కలిసొచ్చిందంటారా? అని ఒకరు అడుగగా.. "కష్టపడ్డా.. పనిచేశా.. పాలమ్మినా.. పూలమ్మినా" అని మల్లారెడ్డి వర్షెన్ లో రిప్లై ఇచ్చాడు ఇమాన్యుయల్. మీ తర్వాత సినిమా ఏంటి అని ఒకరు అడుగగా.. "గం గం గణేశా" అని చెప్పాడు. ఇలా తను చేస్తున్న నెక్స్ట్ మూవీని ముందే చెప్పేశాడు ఇమాన్యుయల్. ఫైమా అక్క గురించి చెప్పు అన్న అని ఒకరు అడుగగా.. మంచి కమెడియన్.. హార్డ్ వర్కర్..‌ నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. ఇలా ఇమ్మాన్యుయేల్ తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నాడు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.