సిరి హనుమంతు, దీప్తి సునైన హగ్గులు.. వీడియోపై షన్ను ఫ్యాన్స్ ఫైర్!
on Feb 5, 2025
బిగ్‌బాస్ ద్వారా లాభమోచ్చిన వారికంటే నష్టపోయిందే ఎక్కువ మంది. అయితే నష్టపోయిన వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఫస్ట్ బెంచ్ లో ఉంటాడు. ఎందుకంటే యూట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన భారీ పాపులారిటీతో బిగ్‌బాస్ సీజన్-5లోకి అడుగుపెట్టాడు షణ్ముఖ్(Shanmuk Jashwanth). అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత సిరి హనుమంతుతో తన బిహేవియర్ కారణంగా దారుణంగా ట్రోల్స్ కి గురయ్యాడు. దీంతో బిగ్‌బాస్ కప్పుపోయింది.. బయటికొచ్చిన తర్వాత లవర్ దీప్తి సునైన బ్రేకప్ చెప్పేసింది. అయితే షన్ను ఫ్యాన్స్ సిరి హనుమంతు, దీప్తి సునైనలపై ఫైర్ అయ్యారు.
తాజాగా తన లవర్ శ్రీహన్ తో సిరి ఓ బిజినెస్ మొదలుపెట్టింది. తన సొంతూరు వైజాగ్‌లో ఓ బ్యూటీ క్లినిక్ స్టార్ట్ చేసింది. HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ పేరుతో ఫిబ్రవరి 2న దీన్ని గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ ఓపెనింగ్‌కి బిగ్‌బాస్ సెలబ్రెటీలు చాలా మంది హాజరయ్యారు. అయితే అందులో దీప్తి సునైన కూడా ఉంది. నిజానికి షన్నుతో దీపూ బ్రేకప్ చెప్పడానికి ప్రధాన కారణం సిరి అన్నది అందరికి తెలిసిందే. అలాంటిది సిరి ఆహ్వానించగానే దీపూ ఇలా వైజాగ్‌లో వాలిపోవడం.. ఈ మేకప్ క్లినిక్ ప్రారంభోత్సవానికి రావడం అందరిని ఆశ్చర్యపరచింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోల్లో సిరికి కంగ్రాట్స్ చెప్తూ హగ్గు ఇస్తూ దీప్తి సునైన(Deepthi sunaina) తెగ సంతోషంగా కనపడింది.
ఇక ఈ వీడియోని దీప్తి సునైన, సిరి హనుమంతు తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలు చూసిన షణ్ముఖ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నువ్వు బ్రేకప్ చెప్పడానికి రీజన్ అయిన సిరితో ఎలా సంతోషంగా నవ్వుతున్నావంటూ దీపూని సూటిగా అడుగుతున్నారు. మీరూ మీరూ ఒక్కటైపోయి షన్నుని మధ్యలో ఎర్రిపప్పని చేశారుగా అంటూ కామెంట్లలో తిట్టుకుంటున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
