కుంభమేళాలో మెరిసిన బిందు మాధవి.. వాళ్లకి చివాట్లు.. ఈమెకు పొగడ్తలు!
on Feb 5, 2025
బిగ్ బాస్ అన్ని సీజన్లో లేడి కంటెస్టెంట్స్ లలో ఎవరైతే చివరి వరకు ఉండి టాప్-5 లో ఉంటారో వారే ఎక్కువ క్రేజ్ ని తెచ్చుకుంటారు. వారిలో ప్రియాంక జైన్, ఇనయా ఉండగా ఓటీటీ సీజన్ లో సత్తా చాటిన బిందు మాధవి ఒకరు. ఆడపులిగా ఆట ఆడి.. అఖిల్‌ని ఆడ.. అంటూ ఓ ఆట ఆడించి.. ఫైనల్‌లో అతన్ని మట్టికరిపించి బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా నిలిచింది బిందు మాధవి. నీ ముందే టైటిల్ గెలుస్తా.. నా సత్తా ఏంటో చూపిస్తానంటూ నటరాజ్ మాస్టర్ ముందు సవాల్ చేసి అన్నట్టుగానే అతని ముందే టైటిల్ గెలుచుకుంది. అయితే బిందు మాదవి బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా కనపడలేదు. అడపాదడపా సినిమాల్లో, సిరీస్ లలో కనపడినా పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ భామ.
ప్రయాగలో జరుగుతున్న మహాకుంభమేళాకి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చారు. ఇక తాజాగా బిందు మాధవి అక్కడికి వెళ్ళి గంగలో స్నానం చేసింది. అయితే దానికి డిఫరెంట్ కామెంట్లు వస్తున్నాయి. రీసెంట్ గా యాంకర్ లాస్య తన ఫ్యామిలీతో కలిసి మహా కుంభమేళాలో సందడి చేసింది. లాస్య అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. మహాకుంభమేళలో తమ పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "సంగమంలో ఒక పవిత్ర మునక వేసేసరికి నాలో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించింది " అంటూ కామెంట్ చేసింది. ఇక దీనికి నెటిజన్లు కామెంట్ల మోత మోగించారు. అక్కడ కూడా ఫోటో షూట్స్ అవసరమా. మీరు వెళ్ళింది భక్తి కోసమా లేక ఇన్స్టా స్టోరీల కోసమా అంటూ ఒక నెటిజన్ ఘాటుగా అడిగాడు. అయితే బిందు మాధవి చేసిన ఈ పోస్ట్ లకి మాత్రం చాలావరకు పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. అంటే ఇక్కడ మన బిహేవియర్ బట్టి ఎదుటివారి కామెంట్లు ఉంటాయి.
భక్తి శ్రద్ధలతో చేయాల్సిన పూజలని ఫోటల కోసం, వ్లాగ్స్ కోసం చేస్తున్న కొంతమంది లాస్య, ప్రియాంక జైన్ లాంటి వారిని నెటిజన్లు తిడుతూనే ఉంటారు. బిందు మాధవి తన ఇన్ స్టాగ్రామ్ లో.. థాంక్ యూ అమిత్ ఫర్ కాప్చరింగ్ దిస్ ప్రెసియస్ మూమెంట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి పోస్ట్ చేసింది. మొత్తంగా బిందు మాధవి మూడు ఫోటోలని షేర్ చేయగా థర్డ్ ఫోటో గురించి కాస్త నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
