రైతును ఎంత చీప్ గా చూస్తున్నారో..ఆదిరెడ్డి ఫైర్
on Feb 5, 2025
ఇష్మార్ట్ జోడి 3 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ వారం "ఛాలెంజ్ థీమ్" ఇచ్చారు. ఐతే ఇందులో యాంకర్ ఓంకార్ అడిగిన ప్రశ్నకు ఆదిరెడ్డి ఫుల్ ఫైర్ అయ్యాడు. ఆది మంచి ఫైర్ మీద మాట్లాడిన మాటలకు అందరికీ కన్నీళ్లు వచ్చేసాయి. "మీ ఫామిలీస్ లో ఫేస్ చేసిన ఛాలెంజ్ సిట్యుయేషన్ ఏంటి ? దాన్ని ఎలా అధిగమించారు " అని అడిగాడు. అంతే వెంటనే ఆదిరెడ్డి మైక్ తీసుకుని ఆపకుండా మాట్లాడాడు.
" మా నాన్న జీవితం మొత్తం ఎక్కడ వేలు పెట్టినా లాస్ అన్నా. అగ్రికల్చర్ లోన్లు 11 .50 లక్షలు ఉన్నాయి 2012 లో. ఇది మా ఒక్కరిదే కాదన్నా..రైతు అన్న ప్రతీ ఒక్కరూ ఫేస్ చేసిన ప్రోబ్లం ఇది. నాకు కోపం వస్తూ ఉంటుంది. ఏ ఆఫీస్ కన్నా వెళ్ళు. రైతుల్ని చాలా చీప్ గా చూస్తారు. పోయి ఆడ కూర్చో. ఇట్రా..ఇక్కడుండు ..ఎన్నిసార్లు చెప్పా నీకు అంటూ చీదరించుకుని మాట్లాడతారు. ఫస్ట్ సర్ అని రైతును...గౌరవం ఇవ్వాలంటే ఫస్ట్ రైతుకు తర్వాత సైనికుడికి ఇవ్వాలి. కానీ అందరికీ గౌరవం ఇస్తూ వాళ్ళ ఇద్దరినీ వదిలేస్తూ ఉన్నారు అందరూ" అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆ మాటలకు జోర్దార్ సుజాత కన్నీళ్లు పెట్టేసుకుంది. ఆ తర్వాత ఆదిరెడ్డి మాటలకు ఓంకార్ కూడా మాట్లాడాడు. "ప్రతీ ఒక్క రైతుకు గౌరవం ఇస్తే నిజంగా మనం తినే ప్రతీ మెతుకు ఒక అర్ధం..పరమార్ధం ఉంటుంది" అని ఆ ప్రోమోలో చెప్పాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
