ENGLISH | TELUGU  
Home  » TV News

రిషి, వసుధారకి అమ్మవారి ఆశీర్వాదం దొరికిందా!

on May 18, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -765 లో.. శైలేంద్ర, దేవయాని ఆడే ఆటలో బొమ్మగా మారిపోయింది జగతి. పెద్దమ్మ, అన్నయ్యలనే తప్పు పడుతారా అంటూ జగతి మేడంని తప్పుగా అర్థం చేసుకుంటాడు రిషి. సర్ నేను మేడం తరుపున క్షేమించమని అడుగుతానని వసుధార చెప్పి.. శైలేంద్ర, దేవయానిలను క్షేమించమని అడుగుతుంది. ఇక మీరు గుడికి వెళ్లాలనుకుంటున్నారు కదా వెళ్ళండని మహేంద్ర, ఫణింద్ర లు రిషి, వసుధారలని గుడికి పంపిస్తారు.

ఆ తర్వాత అందరూ వెళ్లిపోతారు. దేవయాని, శైలేంద్ర మాత్రమే జగతితో మాట్లాడుతారు. ఈ రోజు నా ప్లాన్ రిషిని చంపడం కాదు.. నిన్ను మానసికంగా శిక్షించడం.. రిషి మనసులో నీ స్థానం లేకుండా చెయ్యడమంటూ చెప్తాడు. అలా దేవయాని, శైలేంద్ర ఇద్దరు నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. జగతి ఏడుస్తూ రిషి అన్న మాటలనే గుర్తు చేసుకుంటుంది. మరొకవైపు గుడికి వెళ్లిన రిషి, వసుధారలు అమ్మవారికి మొక్కుకుంటారు. నా పొగరు నా సొంతం అవుతుందని రిషి అనుకుంటాడు.

మీరు అనవసరంగా ఎక్కువగా అలోచించి టెన్షన్ పడుతున్నారు.. చూసావ్ కదా ఈ రోజు మేడం ఎలా ప్రవర్తించారోనని రిషి అంటాడు. ఇద్దరు కలిసి పూలదండని అమ్మవారికి వేస్తుండగా.. రిషి పడిపోతుంటాడు.. పూలదండ రిషి, వసుధారల మెడలో పడుతుంది. చూసావా మన పెళ్ళికి అమ్మవారు కూడా ఓకే చెప్పారని రిషి అంటాడు.

మరొకవైపు దేవయాని, శైలేంద్ర కలిసి ధరణిని తిడుతారు. జగతి అలా ఉండటం చూసిన మహేంద్ర.. నువ్వు ఎందుకిలా ఉంటున్నావ్ ? దేని గురించి బాగా టెన్షన్ పడుతున్నావ్. దేవయాని వదిన లాగా శైలేంద్ర కాదు రిషి గురించి మంచిగా ఆలోచిస్తాడు.. దేవయాని వదిన కూడా ఒక్క నీ మీద కోపం అంతే.. కానీ రిషిని బానే చూసుకుంటుంది. నువ్వు దేని గురించి ఆలోచించకని జగతికి చెప్తాడు మహేంద్ర.

ఆ తర్వాత జగతి దగ్గరికి శైలేంద్ర, దేవయాని వస్తారు. రిషి, వసుధారలు ఇంకా రాలేదు.. నేను కాల్ చేసి కనుక్కోవాలా అని శైలేంద్ర అంటాడు. పిన్ని మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారని శైలేంద్ర అంటాడు.. వద్దు వాళ్ళకి కాల్ చెయ్యకని జగతి అంటుంది. మరొకవైపు రిషి, వసుధారలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ.. ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడే శైలేంద్ర కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.