ENGLISH | TELUGU  
Home  » TV News

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కొత్త ట్విస్ట్.. ముకుందని తీసుకెళ్తానన్న శ్రీనివాస్!

on May 18, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-159 లో.. ఏసీపీ సర్  రోజంతా రెస్ట్ లేకుండా తిరిగాడు.. అటు గుడికి, ఇటు రెస్టారెంట్ కి వెళ్ళాం.. సర్ పై ఎన్ని కళ్ళు పడ్డాయో ఏమో అంటూ మురారికి దిష్టితీస్తుంది కృష్ణ. అది చూసిన రేవతి, భవాని ఇద్దరు మురిసిపోతుంటారు. ముకుంద మాత్రం వాళ్లిద్దరిని అలా చూస్తూ బాధపడుతుంది.

మరొకవైపు ముకుంద వాళ్ల నాన్న శ్రీనివాస్ దగ్గరికి.. ముకుంద బాబాయ్ పిన్ని వస్తారు. వాళ్ళు తమ కూతురి పెళ్లికార్డు ఇవ్వడానికి వచ్చి ముకుంద ఎక్కడ ఉంటుందంటూ తన గురించి అడిగి తెలుసుకుంటారు. మీకు మీ కూతురు గురించి పట్టించుకోవడమే చేతకాదు.. మీకు మేడల్లో కూతురు ఉంటే చాలు.. సంతోషంగా ఉండడం అవసరం లేదా.. మీ అల్లుడు వస్తాడో రాడో తెలియదు.. మీ ఇంటికి తీసుకొచ్చి వేరే పెళ్లి చెయ్యాలనే ఆలోచనే మీకు లేదా అంటూ ముకుంద నాన్నతో ముకుంద వాళ్ళ పిన్ని అంటుంది. శ్రీనివాస్ ఆలోచనలో పడతాడు.

మరుసటి రోజు ఉదయం భవాని కొన్ని రోజులు క్యాంప్ కి వెళ్లడానికి రెడీ అవుతుంది. హాల్లోకి అందరూ వచ్చి భవాని తో మాట్లాడుతారు. ఇకనుండి వీళ్ళకి ఏం అవసరం వచ్చినా నువ్వే చూసుకోవాలంటూ మురారితో చెప్తుంది భవాని.

సరే పెద్దమ్మ, నాకు నీ గురించి దిగులుగా ఉంది అమ్మ అని మురారి అంటాడు. ఆ తర్వాత ముకుంద అందరితో టైం స్పెండ్ చెయ్ అంటూ ముకుందతో భవాని చెప్తుంది. అప్పుడే ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ వచ్చి.. ఆ అవసరం ఇక లేదు.. ఈ ఇంట్లో అందరు అందరికి తోడుగా ఉన్నారు. నా కూతురు మాత్రం ఒంటరిగా ఉంది. నా కూతురుని నేను తీసుకొని వెళ్ళిపోతానని ముకుంద వాళ్ళ నాన్న శ్రీనివాస్ అనగానే.. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆదర్శ్ ఎలాగూ వచ్చేలా లేడు.. కాబట్టి కోర్ట్ లో పిటిషన్ వేస్తే విడాకులు త్వరగా వస్తాయి. ఆ తర్వాత నా కూతురుకి వేరే పెళ్లి చేస్తానని శ్రీనివాస్ అంటాడు.

మీరు పెళ్లి చేసి పంపించి ముకుంద బాధ్యతలు మాకు అప్పగించారు.. మేము ముకుందకి ఏ లోటు రాకుండా చూసుకుంటాము.. ప్రస్తుతం నేను పని మీద బయటకు వెళ్తున్నాను.. వచ్చాక అన్నింటి గురించి మాట్లాడుతాను.. మాకు కొంచెం టైమ్ ఇవ్వండని శ్రీనివాస్ తో  భవాని అంటుంది. సరేనని చెప్పి శ్రీనివాస్ అక్కడ నుండి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత భవాని వెళ్లిపోతూ.. ముకుందకి ఇంట్లో ఏ లోటు రాకుండా చూసుకోండని చెప్తుంది. భవాని అందరికి బై చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శ్రీనివాస్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు మురారి. అప్పుడే మురారి దగ్గరికి కృష్ణ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.