ENGLISH | TELUGU  
Home  » TV News

కావ్యకి ఖరీదైన చీరలు కొనిపెట్టిన రాజ్!

on May 18, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -98 లో.. రాజ్ టిఫిన్ చెయ్యకుండా ఆఫీస్ కి వెళ్ళడాని భావించిన కావ్య.. రాజ్ కోసం వంటలు చేసి క్యారియర్ తీసుకొని ఆఫీస్ కి వెళ్తుంది. అది చూసిన రుద్రాణి పాపం రాజ్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తుందనుకుంటాను.. అపర్ణ ముందు కావ్యని ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లుగా భావించి తనలో తానే నవ్వుకుంటుంది రుద్రాణి.

మరొకవైపు రాజ్ ఆఫీస్ లో ఎంప్లాయిస్ పై అరుస్తాడు. ఇదేంటి ఇంత ఆకలిగా ఉంది.. ఆ కావ్య వల్లే ఇదంతా అని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత కావ్య క్యారియర్ తీసుకొని ఆటోలో వచ్చి రాజ్ ఆఫీస్ ముందు దిగుతుంది. కావ్య లోపలికి వస్తుంటే సెక్యూరిటీ ఆపుతాడు. నన్ను లోపలికి వెళ్లనివ్వండని కావ్య అంటుంది. లోపల మీకు సంబంధించిన వాళ్ళు వర్క్ చేస్తున్నారా అని కావ్యని సెక్యూరిటి వాళ్ళు అడుగుతారు. అందరికి జాబ్స్ ఇస్తాడు నా భర్త. మీ ఎండీ సర్ అని కావ్య అనగానే.. ఏంటి మా సర్ మీ భర్తనా అంటూ ఎగతాళిగా నవ్వుకుంటారు.

అవును మీరు ఎందుకు నవ్వుతున్నారని కావ్య అంటుంది. మా ఎండి సర్ వైఫ్ అయితే ఇలా ఆటోలో ఎందుకు వస్తుంది. ఇంకా ఇలాంటి చీరలు సర్ వాళ్ళ వైఫ్ కట్టుకుంటుందా అంటూ మళ్ళీ ఎగతాళిగా నవ్వుతారు. అదంతా చూస్తున్న రాజ్ వచ్చి.. సెక్యూరిటీ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి.. నాకోసం వచ్చిన వాళ్ళతో అలాగేనా ప్రవర్తించేది అంటూ ఎండలో నిల్చొని ఉండండంటూ పనిష్మెంట్ ఇస్తాడు రాజ్. ఇక ఆ తర్వాత కావ్యని తీసుకొని రాజ్ షాపింగ్ కి వెళ్తాడు. లోపలికి రా అని రాజ్, కావ్యని అంటాడు.

నేను రానని కావ్య అంటుంది.. అప్పుడే అక్కడ ఉన్న కానిస్టేబుల్ వచ్చి.. ఏంటి ఆ అమ్మాయిని బలవంతంగా ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఆడుగుతాడు.. లేదండి తను నా భార్య అని రాజ్ అంటాడు. ఆ మాట ఆవిడని చెప్పమనండి అని కానిస్టేబుల్ అంటాడు. నేను చెప్పను.. నాకు సారీ చెప్పండని కావ్య బెట్టు చేసి మరీ రాజ్ తో సారీ చెప్పించుకుంటుంది. అప్పుడు తను నా భర్త అని కానిస్టేబుల్ తో చెప్తుంది కావ్య. ఆ తర్వాత ఇద్దరు కలిసి షాప్ లోపలికి వెళ్తారు.

కావ్యకి రాజ్ చీరలు కొనిస్తున్నాడని తను షాక్ అవుతుంది. కావ్య మంచి చీరలు తీసుకుంటుంది. రాజ్ బిల్ల్ కడుతూ.. ఇక నుంచి నువ్వు బయటకు వెళ్ళినా.. ఆఫీస్ కి వచ్చినా ఇలాంటి ఖరీదైన చీరలు కట్టుకొని రమ్మని రాజ్ అనగానే.. సెక్యూరిటీ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది కావ్య. మరొకవైపు స్వప్నని కలవడానికి వచ్చిన రాహుల్.. షాపింగ్ చేసుకుని వస్తున్న రాజ్, కావ్యలను చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.