జానులిరి అంటే ఈ స్టేట్ లోనే నార్మల్ పేరు కాదు.. వీళ్లిద్దరి కోసమే ఈ షోకి వచ్చాను
on Jul 26, 2025

ఢీ 20 ట్రెండింగ్ స్పెషల్ 2 . 0 పేరుతో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఫుల్ జోష్ తో నిండిపోయి ఉంది. ఈ షోకి ఒక స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. "ఢీ 3 ఛాంపియన్ మనందరి ఫేవరేట్ , మోస్ట్ స్టైలిష్ కొరియోగ్రాఫర్ ఆఫ్ టాలీవుడ్ రఘు మాష్టర్" అంటూ నందు అనౌన్స్ చేసేసరికి రఘు మాష్టర్ స్టేజి మీదకు వచ్చారు. "19 సీజన్స్ కంటే చాలా గొప్ప సీజన్ ఢీ 20 " అన్నారు. అలాగే మంచి జోష్ తో "హులాల హులాల" అనే సాంగ్ కి డాన్స్ కూడా చేశారు. ఇక నందిని వచ్చి కోర్ట్ మూవీలోని "కథలెన్నో చెప్పారు" సాంగ్ కి ఎల్లో కలర్ కాస్ట్యూమ్ తో చేసింది. ఇక రఘు మాష్టర్ కి ఈ పెర్ఫార్మెన్స్ నచ్చేసింది. "ఈ సాంగ్ మూవీలో ఎంత బాగుందో ఇక్కడ కూడా అంతే బాగుంది" అన్నారు. తర్వాత జాను లిరి వచ్చింది. "దారిపొంతొత్తుండు" సాంగ్ కి డాన్స్ చేసింది. దాంతో రఘు మాష్టర్ ఫుల్ ఫిదా ఇపోయారు. లేచి పేపర్ చింపేసి "జాను అంటేనే ఈ స్టేట్ లో నార్మల్ పేరు కాదది" అని చెప్పారు.
తర్వాత కండక్టర్ ఝాన్సీ వచ్చింది. ముసలామె గెటప్ లో "జామ చెట్టుకు కాస్తాయ్ జామకాయలు" అనే సాంగ్ కి ముసలామెలా డాన్స్ చేసింది. ఇంతలో ఒక ముసలాయన గెటప్ లో వచ్చి ఒక వాటర్ బోటిల్ ఇచ్చాడు. "ఏంట్రా ఇది" అని ఝాన్సీ అడిగేసరికి "రఘు మాష్టర్ టానిక్" అన్నాడు. అంతే ఆ టానిక్ తాగేసాక ముసలి ఝాన్సీ కాస్తా "నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి" అంటూ కుర్రదానిలా చిందులేసేసింది. దాంతో రఘు మాష్టర్ ఫిదా ఐపోయాడు. "ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా రావడానికి కారణం వీళ్ళిద్దరే" అన్నారు. ఐతే ఈ ప్రోమోలో అసలు కంటెంట్ ఏంటి...స్టేజి మీదకు వచ్చిందెవరో ఆది హోస్ట్ నందుకు ఎక్ష్ప్లైన్ చేస్తూ ఇదిదా ప్రోమో అంటూ ఎండింగ్ చెప్పాడు..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



