ఆవిడ ఇస్తే గిఫ్టులు తీసుకుంటావ్ ..మన స్నేహం ఎన్నేళ్లో తెలుసా?
on Jul 26, 2025

ఇద్దరు హోస్టులు ఒక షోలో కలిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు సర్కార్ షోలో కూడా అలాగే ఉంది. ఈ షోకి ఆల్రెడీ హోస్ట్ సుధీర్ ఉన్నాడు. ఇక నెక్స్ట్ ప్రోమో చూస్తే ఈ ఎపిసోడ్ కి ప్రదీప్ కూడా వచ్చాడు. ప్రదీప్ ఆల్రెడీ సీనియర్ హోస్ట్ ఢీ డాన్స్ షోని ఎన్నో సీజన్స్ నిర్వహించాడు. అటు మూవీస్ లో కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గా కూకు విత్ జాతిరత్నాలు షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఇప్పుడు గెస్ట్ గా సర్కార్ సీజన్ 5 కి వచ్చాడు. ఇక రాగానే సుధీర్ ని ఫుల్ గా ఏడిపించాడు. ప్రదీప్ స్టేజి మీదకు రాగానే అబ్బా ఎంత ఆనందం వచ్చింది అంటూ వెళ్లి సుధీర్ ని హగ్ చేసుకున్నాడు.
"హాయ్ హలో వెల్కమ్ టు సర్కార్ సీజన్ 5 " అంటూ షో లింక్ ని ప్రదీప్ చెప్పాడు. దాంతో సుధీర్ కంగారు పడిపోయాడు. ఎందుకంటే ప్రదీప్ గతంలో సర్కార్ ని హోస్ట్ చేసాడు. ఇక సుధీర్ "హలో యాంకర్ ఇక్కడ" అన్నాడు. "ఫోటోలు ఇప్పుడు కాదమ్మా ..నీ డ్రెస్ చూసి పెద్ద జోకర్ అనుకున్న" అంటూ సుధీర్ మీద కౌంటర్ వేసాడు ప్రదీప్. "ఇంతకు మనది ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్ షిప్పో గుర్తుందా..పోనీ వేరే షిప్పులు ఎన్నాళ్ళో గుర్తున్నాయా " అంటూ ప్రదీప్ అడిగాడు. "అది" అంటూ సుధీర్ సిగ్గు పడేసరికి "ఎం చచ్చిపోవాలనిపిస్తోందా" అంటూ అడిగాడు.."కాదు చంపేయాలనిపిస్తోంది" అన్నాడు ప్రదీప్. "12 ఏళ్ళు మన ఫ్రెండ్ షిప్..సరే నేను నీకు 12 గిఫ్ట్ లు ప్లాన్ చేసాను" అని ప్రదీప్ అనేసరికి "ఎక్కడో కొడతాంది శీనా" అంటూ సుధీర్ అన్నాడు. "ఆవిడ ఇస్తే గిఫ్టులు తీసుకుంటావ్ నేను ఇస్తే 12 గిఫ్ట్ లు తీసుకోవు" అన్నాడు. "ఇంతకు ఎవారావిడా" అని సుధీర్ అన్నాడు. "ఏంటి ఆవిడెవరో తెలీదా.అన్న బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు " అంటూ ప్రదీప్ కౌంటర్ వేసాడు. ప్రోమో ఫైనల్ లో ప్రదీప్ అన్నతో చిన్న పోజ్ ఇవ్వాలని ఉంది అన్నాడు సుధీర్. ఇంతలో లైట్స్ ఆర్పేసారికి "లైట్ లు ఆపెంత పోజ్ కాదు.." అనేసరికి లైట్స్ వెలిగాయి. వెంటనే సుధీర్ మోకాలి మీద ప్రదీప్ కూర్చుని థంబ్ పెట్టాడు" అలా వీళ్ళిద్దరూ కలిసి ఫొటోస్ దిగారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



