భానుప్రియలా ఉన్నారు..డాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చుగా
on Jul 26, 2025

బిగ్ బాస్ సీజన్ 1 అంటే ముందుగా గుర్తొచ్చేది హరితేజ. ఎందుకంటే అందులో టాస్కులు ఆడింది అలాగే హరికథ కూడా చెప్పి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. హరితేజ మల్టి టాలెంటెడ్ లేడీ. చాల మూవీస్ లో నటించింది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. బుల్లి తెర షోస్ కి యాంకర్ గా చేసింది. చిన్నారి, రక్త సంబంధం, మనసు మమతా, కన్యాదానం, అభిషేకం వంటి సీరియల్స్ లో నటించింది. సూపర్ సింగర్, పటాస్, బ్లాక్ బస్టర్ వంటి షోస్ లో కనిపించి ఎంటర్టైన్ చేసింది. విలేజ్ లో వినాయకుడు, ఆడవారి మాటలకు అర్దాలు వేరులే, అనగనగా ఒక ధీరుడు, అత్తారింటికి దారేది, విన్నర్, దువ్వాడ జగన్నాధం, నేనే రాజు, నేనే మంత్రి, అ-ఆ, అరవింద సమేత వంటి ఎన్నో మూవీస్ లో నటించింది.
ఇక రీసెంట్ గా ఆమె భానుప్రియ మూవీలోని "చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా" పాటకు ఆమె అద్భుతంగా డాన్స్ చేసి ఆ రీల్ ని పోస్ట్ చేసింది. ఇక నెటిజన్స్ ఐతే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. "జూనియర్ భానుప్రియ, భానుప్రియలా ఉన్నారు.. డాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చుగా హరితేజ అక్క. గ్రేస్ ఫుల్ డాన్స్, మీకు వందనాలు అండి..మీ డాన్స్ ని చూస్తూనే ఉండాలనిపిస్తోంది. స్వర్ణ కమలంలో భాను ప్రియా గారు గుర్తొచ్చారు. చాల బాగా చేశారు. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి" అంటూ కామెంట్స్ చేశారు. ఈమె కూచిపూడి కూడా నేర్చుకుంది కాబట్టే ఏ డాన్స్ ఐనా అలవోకగా చేసేస్తుంది. అలాగే మంచి సింగర్ కూడా. అప్పుడప్పుడు డాన్స్ తో పాటు పాటలు కూడా పాడుతూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె తమ్ముడు మూవీలో కూడా నటించింది. వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ లో కూడా నటించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



