36 సంవత్సరాల తర్వాత నాగార్జునతో అమల!
on Nov 8, 2025
.webp)
బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వీకెండ్ రానే వచ్చింది. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున 'శివ' మూవీ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. తన 'శివ' సినిమా రీ రిలీజ్ గురించి ప్రేక్షకులకు చెప్పాడు.. అంతేకాకుండా తనతో పాటు తన భార్య 'అమల' ని వెంట తీసుకొని వచ్చాడు. ఇద్దరు కలిసి 'శివ' మూవీలో సాంగ్ కి రెండు స్టెప్పులు కుడా వేశారు.
కంటెస్టెంట్స్ అందరు శివ సినిమాలోని సాంగ్స్ కి డ్యాన్స్ చేశారు. తనూజ-కళ్యాణ్ ఒక జోడీగా , దివ్య-ఇమ్మాన్యుయల్ ఒక జోడీగా, డీమాన్ కళ్యాణ్-రీతూ ఒక జోడిగా పర్ఫామెన్స్ ఇచ్చారు. వాళ్ళ డాన్స్ లకి 'అమల' ఫిదా అయింది. ఆ తర్వాత డైరెక్టర్ ఆర్జీవీ స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చాడు. రాము తనని ఒక క్వశ్చన్ అడిగాడు. శివ సక్సెస్ అయినప్పుడు మీకెలా అనిపించిందని ఆర్జీవీని అడిగాడు. సాడ్ గా అనిపించింది.. అదేం స్టుపిడ్ క్వశ్చన్ అని రాము మొహం పైనే ఆర్జీవీ చెప్పాడు. మీరు హౌస్ లో ఉండమంటే ఉంటారా అని నాగార్జున అడుగుతాడు. సంజనలాంటి అందమైన అమ్మాయిలు ఇరవై మంది ఉంటే ఉంటానని ఆర్జీవీ బోల్డ్ గా సమాధానమిచ్చాడు.

అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జున-అమల జంటని చూసిన ఆడియన్స్ కి మాత్రం ఫుల్ పండగే.. ఈ రోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఈ ఎపిసోడ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వారం హౌస్ లో ఏఏ కంటెస్టెంట్స్ మీద నాగార్జున ఫైర్ అయ్యాడనేది ఈ ప్రోమోలో లేదు. ఆర్జీవీ అభిమానులు కూడా ఈ ప్రోమో చూసి ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



