Bigg Boss Telugu 9: దివ్యని తప్పుగా అర్థం చేసుకున్న క్రయింగ్ బేబీ!
on Nov 8, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం నామినేషన్లు ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా సంజన, సాయి శ్రీనివాస్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇక నిన్నటి వరకు సాగిన కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ లో చివరికి రీతూ, ఇమ్మాన్యుయేల్ ఉండగా ఇమ్మాన్యుయేల్ గెలిచాడు.
తనూజని బిగ్ బాస్ దత్తపుత్రిక అంటారు. ఎందుకంటే తనని పాజిటివ్ చేయడం కోసం మిగతా కంటెస్టెంట్స్ ని బలి చేస్తున్నారు. నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో రీతూ , ఇమ్మాన్యుయేల్ , తనూజ ఉండగా వారిలో నుండి ఒకరిని తీయాలని దివ్యకి ఛాన్స్ వచ్చింది. ఇక తన పర్ స్పెక్టివ్ లో ఇమ్మాన్యుయల్ ని కెప్టెన్ గా చూడాలని అనుకుంది. అలా చేయాలంటే రీతూని తీసేస్తే.. అందరు ఇమ్మాన్యుయేల్ ని తీసేస్తారు. సో తనూజని తీసేస్తే కొంతమంది సపోర్ట్ అయినా ఇమ్మాన్యుయల్ కి దక్కుతుంది. అందుకే తనూజని తీసేసి ఇమ్మాన్యుయల్ ని కెప్టెన్ ని చేసేసింది. మరి ఇమ్మాన్యుయేల్ ఈ కృతజ్ఞత ఉంచుకుంటాడా లేదా అనేది తరువాతి వారం టాస్క్ లలో తెలుస్తోంది.
తనూజ తన దృష్టిలో ఏం అనుకుంటుందంటే.. భరణి, దివ్య మధ్యలో తను అడ్డుగా ఉందనుకొని అందుకే తనని కెప్టెన్సీ రేస్ నుండి తొలగించిందని ఏడుస్తూ వెళ్ళిపోయింది. నువ్వు పర్సనల్ గా తీసుకొని భరణి గారు నాకు సపోర్ట్ చేస్తున్నారని నన్ను కెప్టెన్సీ రేసు నుండి తొలగించావని దివ్యని ఇష్టమొచ్చినట్టు మాటలు అనేసింది తనూజ. తనూజ ఏడుస్తూ బెడ్ పైకి వెళ్ళి పడుకొని ఏడ్చేసింది. ఇక భరణి ఓదార్చడానికి వెళ్తే.. భరణి సర్ నాతో మాట్లాడొద్దు ప్లీజ్.. మీ వల్ల తను నన్ను కెప్టెన్సీ రేస్ నుండి తొలగించిందని ఏడ్చేసింది. అందుకే తనూజని అందరు క్రైయింగ్ బేబీ అని అంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా తనూజ క్రైయింగ్ బేబీ అంటు ట్రోల్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



