హత్య కేసులో రాహుల్ ని అరెస్టు చేసిన పోలీసులు..!
on Nov 9, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -873 లో... కావ్య కిచెన్ లో వంట చేస్తుంటే.. రాజ్ వచ్చి మాట్లాడుతాడు. అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ రాహుల్ ఎవరని అడుగుతారు. నేనే అని రాహుల్ చెప్పగానే.. మీరు కోయిలిని హత్య చేసారని తన భర్త రంజిత్ కంప్లైంట్ ఇచ్చాడు.. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పగానే అందరు షాక్ అవుతారు. నేను చంపలేదు జెస్ట్ ఇలా కొట్టానని రాహుల్ చెప్తాడు. ఆ విషయాలన్నీ కోర్ట్ లో తేలుతాయని పోలీస్ లు రాహుల్ ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు.
నా కొడుకుని పోలీసులు తీసుకొని వెళ్తుంటే అలా సైలెంట్ గా ఉన్నారని రుద్రాణి అంటుంది. మరేం చేయమంటావ్ పోలీసులు అంతా చెప్తుంటే అని సుభాష్ అంటాడు. ఆ తర్వాత రుద్రాణికి కోయిలి భర్త రంజిత్ ఫోన్ చేసి.. నీ కొడుకు, నా భార్యని చంపుతున్న వీడియో నా దగ్గర ఉంది. అది కోర్ట్ లో చూపించకుండా ఉండాలంటే రెండు కోట్లు ఇవ్వాలని రంజిత్ అంటాడు. దానికి రుద్రాణి సరే అంటుంది.

రంజిత్ ఫోన్ చేసిన విషయం రుద్రాణి కిందకి వచ్చి అందరికి చెప్తుంది. రెండు కోట్లు ఇవ్వండి. నా కొడుకుని కాపాడండి అని చెప్తుంది. రాహుల్ చంపాడని మేమ్ అనుకోవడం లేదు దానికి సాక్ష్యం కనిపెడుతామని రాజ్, కావ్య అంటారు. మీతో ఉంటే పని అవ్వదని రంజిత్ దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. రుద్రాణి వెంట స్వప్నని వెళ్ళమని రాజ్, కావ్య పంపిస్తారు.
ఆ తర్వాత సాక్ష్యం ఎలా తెస్తారని రాజ్ ని సుభాష్ అడుగుతాడు. మేమ్ అక్కడికి వెళ్లే ముందు అక్కడ కెమెరా పెట్టాము.. కోయిలి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి.. ఇప్పుడు అందులో రికార్డు ఉంటుంది కదా అని కావ్య అంటుంది.
తరువాయి భాగంలో రాజ్, కావ్య వెళ్లి ఆ కెమెరా తీసుకొని వచ్చి అందులో ఉంది చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



