ENGLISH | TELUGU  
Home  » TV News

సిరిని తన డ్రైవర్ అని చెప్పిన శ్రీహాన్!

on May 18, 2023

శ్రీహాన్.. బిగ్ బాస్ సీజన్-6 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ కి ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన శ్రీహాన్.. డ్యాన్సర్ గా, సింగర్ గా తనని తాను ప్రతీరోజు అప్డేట్ చేసుకుంటూ కొంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలా బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకున్నాడు.

బిగ్ బాస్ లోకి వెళ్ళాక మొదటివారం నుండి కూల్ అండ్ కామ్ గా ఆడి.. ఎవరితోను గొడవలకు పోకుండా ఉన్న శ్రీహాన్. ‌ కొన్ని వారాల తర్వాత ఇనయా సుల్తానాతో ప్రతీ చిన్న దానికి గొడవ పెట్టుకోవడంతో.. శ్రీహాన్ కి స్క్రీన్ టైం ఎక్కువ వచ్చింది. ఆ తర్వాత శ్రీసత్యతో కలిసి ఫ్రెండ్‌షిప్ అని చెప్తూ హగ్స్ ఇచ్చుకున్నారు. ఇదంతా చూసిన ప్రేక్షకులు మాత్రం ఇదేం ఫ్రెండ్ షిప్ రా అని అన్నారు. అయితే సింగర్ రేవంత్ కూడా శ్రీహాన్ కి సపోర్ట్ గా ఉండటంతో అతడికి మరింత బలం చేకూరిందనే చెప్పాలి.

అలా రేవంత్, శ్రీహాన్ కలిసి స్నేహమంటే ఇదేరా తరహాలో గేమ్ లలో పాల్లొని, టాస్క్ లలో‌ ఇద్దరు కలిసి తమ బెస్ట్ ఇచ్చి ఫ్యాన్ బేస్ ని పెంచుకున్నారు. అయితే బిగ్ బాస్ 6 టైటిల్ రేసులో చివరకు రేవంత్, శ్రీహాన్ ఇద్దరు మాత్రమే మిగిలారు. అయితే రేవంత్ కే ఎక్కువ ఓట్లు వస్తాయని భావించిన కంటెస్టెంట్స్ అందరూ.. రనరప్ తీసుకో మనీ ఎక్కువ వస్తాయని శ్రీహాన్ తో చెప్పడంతో తను మనీ తీసుకొని డ్రాప్ అయ్యాడు. అయితే చివరిలో శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని, అసలు విన్నర్ తనేనని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అలా బిగ్ బాస్ సీజన్-6 లో శ్రీహాన్ రనరప్ తో సరిపెట్టుకున్నాడు.

అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకొచ్చాక శ్రీహాన్ పెద్దగా బయట కనిపించలేదు. సిరి హనుమంత్ తో కలిసి ఉంటున్న శ్రీహాన్ బిజీ అయ్యాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా లేడనే చెప్పాలి. అయితే గత వారం క్రితం సిరి కోసం బజ్జీలు చేసిన శ్రీహాన్.. ఇప్పుడు తాజాగా మరొక వీడియోతో మనముందుకి వచ్చాడు. సిరితో కలిసి నైట్ టైం కార్ లో వెళ్తూ వీడియో చేసాడు. దానిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు శ్రీహాన్. 'మీట్ ద న్యూ హెవీ డ్రైవర్ ఇన్ ది సిటీ' అని క్యాప్షన్ తో ఆ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసాడు శ్రీహాన్ . ఇలా శ్రీహాన్, సిరి కలిసి నైట్ రోడ్ల మీద తిరుగుతూ రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.