ENGLISH | TELUGU  
Home  » TV News

నుదిటిపై పెట్టే ముద్దు సీక్రెట్ లవ్ ని తెలియజేస్తుందని చెప్పిన రోహిత్!

on May 19, 2023

మెరీనా, రోహిత్ సాహ్ని.. బుల్లితెర సీరియల్స్ చూసే ప్రేక్షకులకు సుపరిచితమే. మెరీనా అబ్రహం గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో‌ జన్మించగా.. రోహిత్ ని పెళ్ళి చేసుకొని హైదరాబాద్ లో ఉంటుంది. అప్పట్లో జీ తెలుగులో ప్రసరమయైన 'అమెరికా అమ్మాయి' సీరియల్ లో కళ్యాణిగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. రోహిత్ కూడా సీరియల్స్ లో నటించాడు. నీలి కలువలు, అభిలాష సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. రోహిత్-మెరీనా ఇద్దరు కలిసి 'డ్యాన్స్ జోడి డ్యాన్స్' లో కూడా నటించారు.

అలా బుల్లితెరపై ఫేమస్ అయిన వీరిద్దరికి బిగ్ బాస్ లో 'రియల్ కపుల్' కోటాలో అవకాశం లభించింది. మెరీనా రోహిత్ బిగ్ బాస్ లో జంటగా అడుగుపెట్టి.. ఇద్దరు మంచి ప్రవర్తనతో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. అయితే రోహిత్ ని ఫ్యామిలీ మ్యాన్ అని అంటారు. రోహిత్ లోని డీసెంట్ నెస్, కూల్ అండ్ కామ్ ప్రవర్తన వల్ల బిగ్ బాస్ సీజన్-6 లో  టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచాడు. బిగ్ బాస్ నుండి వచ్చాక బిబి జోడీలో కూడా డ్యాన్స్ చేశారు. అయితే వీరిద్దరు తమ డాన్స్ తో అందరిని అంతగా మెప్పించలేకపోయారు. దాంతో బిబి జోడి నుండి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ భార్యపై చూపించే ప్రేమ కేరింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. దాంతో అతడికి ఫ్యాన్ బేస్ పెరిగింది. 

రోహిత్ సోషల్ మీడియాకి ఎప్పుడు దూరంగా ఉంటాడు. కానీ మెరీనా ఎప్పటికప్పుడు తమకి సంభందించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అయితే మెరీనా రోహిత్ కలిసి తాజాగా ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడీయోగ్రఫీ స్టుడియోని స్టార్ట్ చేసారు.  'The Wedding Raaga' అనే  పేరుతో స్టార్ట్ చేసారు. దాంతో బిగ్ బాస్ సీజన్-6 కంటెస్టెంట్స్ అయిన శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, వసంతి,  ఫైమా, సుదీప, గీతు రాయల్ అందరూ కంగ్రాట్స్ చెప్తూ తమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. దాంతో ఈ స్టుడియోకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.  అయితే రోహిత్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వెడ్డింగ్ ఫోటోని షేర్ చేసాడు. ఈ ఫోటోకి.. 'నుదిటిపై పెట్టే ముద్దు సీక్రెట్ లవ్ ని తెలియజేస్తుంది' అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రోహిత్. అయితే రోహిత్ చేసిన ఈ పోస్ట్ ని మెరీనా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.