ENGLISH | TELUGU  
Home  » TV News

శేఖర్ మాస్టర్ ఎవరో తెలీదు... ఆదినా..ఎవడాడు...

on May 19, 2023

ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.  ఈ ఫినాలేకి 'బెదురులంక 2012' మూవీ నుంచి హీరోహీరోయిన్స్ కార్తికేయ, నేహా శెట్టి వచ్చారు. తర్వాత హైపర్ ఆది బిచ్చగాడి వేషంలో సెట్ లోకి వచ్చాడు.."ఇలా తయారయ్యేమిటండి" అని ప్రదీప్ అడిగేసరికి "ఎవరైనా కారు, డబ్బులు, నగలు కొట్టేస్తారు...ఆడేవాడో మా ఇల్లు కొట్టేసాడు..ఆర్ ఎక్స్ 100 లో కార్తికేయ పాయల్ రాజపుట్ ని ప్లీజ్ ప్లీజ్ అని ఆదుకున్నాడు...అక్కడేమో డిజె టిల్లు రాధికను ప్లీజ్ ప్లీజ్ అని ఆదుకున్నాడు...ఏమయ్యింది చివరికి..టిల్లు డల్లయ్యాడు...కార్తికేయ కామయ్యాడు" అని కామెడీ చేసాడు ఆది.

తర్వాత ఆది కార్తికేయను ఇంటర్వ్యూ చేసాడు " వాళ్ళెవరూ అంటూ జడ్జెస్ ని చూపించేసరికి మనోళ్లే అన్నాడు..హీరోయిన్ ఎవరు కావాలి మీకు నేహాశెట్టి..పాయల్ రాజపుట్ ఒకేనా" అని అడిగాడు "వాళ్ళ ఇద్దరితో మూవీస్ చేసేసాను" అని చెప్పాడు. ఆది వెళ్లి ఆడియన్స్ లో ఒక ముసలావిడ పక్కన కూర్చున్నాడు ఐతే ఆమె తనకు దూరంగా ఉండాలని, తనను  టచ్ చేయొద్దు అంటూ దూరం జరుగుతోంది అని చెప్పి ఆమెను ఇంటర్వ్యూ చేసాడు "అసలు నీ ప్రాబ్లమ్ ఏమిటి..  ఆ హీరో, హీరోయిన్ పేరేంటి, ఇది ఏ షో అసలు, శేఖర్ మాస్టర్ ని చూసావా...నీకు హైపర్ ఆది తెలుసా" అని అడిగేసరికి "శేఖర్ మాస్టర్ తేలీదు...ఆదీనా ఎవడాడు...అసలు ఏవీ తెలీదు" అని చెప్పి కాసేపు ఫన్ క్రియేట్ చేసింది ఆ బామ్మ. పండు మాష్టర్ కంటెస్టెంట్ నవీన్ పుష్ప 2 గెటప్ లో వచ్చి డాన్స్ పెర్ఫార్మ్ చేసేసరికి నేహశెట్టి ఫిదా ఐపోయింది. గ్రీష్మ కంటెస్టెంట్స్ గగన్-దిశా చేసిన హాట్ పెర్ఫార్మెన్స్ కి శేఖర్ మాష్టర్ కూడా చాలా ఖుషీ ఐపోయాడు "గ్రాండ్ ఫినాలేని ఒక లెవెల్ పెంచావ్" అన్నాడు. "ఏసీ పెంచడబ్బా...కొంచెం వేడిగా ఉంది పెర్ఫార్మెన్స్" అని కాంప్లిమెంట్ ఇచ్చింది శ్రద్దా.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.