ENGLISH | TELUGU  
Home  » TV News

చింపాంజీని ఎత్తుకొని ఎమోషనల్ అయిన రాహుల్ సిప్లిగంజ్!

on May 19, 2023

రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. ఒక గొప్ప సెలెబ్రిటీగా మారిపోయాడు. ఇండస్ట్రీకి వచ్చి కొంతకాలమే అయిన మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ అయిపోయాడు. రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. 'మంగమ్మ' అనే ఫోక్ సాంగ్ ని రిమిక్స్ చేసి రాహుల్ పాడాడు. పాడటమే కాకుండా ఆ పాటలో   నటించాడు. అప్పట్లో ఈ‌ సాంగ్ మంచి క్రేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా  రాహుల్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని  పెంచుకున్నాడు.

అలా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు రాహుల్. ఆ తర్వాత బిగ్ బాస్-3 లో‌ అవకాశం దక్కించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో అందరితో‌ సన్నిహితంగా ఉంటూ తనదైన శైలితో అందరిని ఆకట్టుకున్నాడు. దాంతో బిగ్ బాస్ సీజన్-3 లో విజేతగా నిలిచాడు రాహుల్. బిగ్ బాస్ తర్వాత రాహుల్ కి ఆఫర్స్ ఎక్కువగా రావడంతో బిజీ జీవితం గడుపుతున్నాడు.

రాహుల్ జోష్ సినిమాలో కాలేజీ బుల్లోడా పాట పాడాడు. ఆ తర్వాత 'లై' సినిమాలో బొంబాత్ పాట, ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని 'బోనాలు' పాట, చిత్రలహరి సినిమాలోని 'గ్లాస్ మేట్స్' రంగస్థలంలోని 'రంగా రంగా' పాట, అలవైకుంఠపురంలోని 'ఓ మై గాడ్ డాడీ', 90ML లోని సింగిల్ సింగిల్ ఇలా కెరీర్ లో మంచి హిట్ సాంగ్స్ ని పాడి ట్రెండింగ్ లో ఉన్నాడు రాహుల్ సిప్లిగంజ్.

అయితే రాహుల్ తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీలో పాడిన 'నాటు నాటు' పాటకి ఆస్కార్ రావడం అందరికి తెలిసిందే..దాంతో అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యడానికి రాహుల్ కొన్ని రోజులు దుబాయ్ కి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి బాగా ఎంజాయ్ చేసాడు. అయితే ఆ ఫ్రెండ్స్ లో అషురెడ్డి కూడా ఉండటంతో.. అషురెడ్డి తో రాహుల్ దిగిన ఫొటోస్ అప్పట్లో ఎంత వైరల్ గా మారాయో అందరికి తెలిసిన విషయమే.

రాహుల్ తాజాగా దుబాయ్ లోని ఒక జూ పార్క్ కి వెళ్ళాడు. అక్కడ సరదగా ఒక చింపాజీనొ ఎత్తుకొనగా..  అ చింపాజీ రాహుల్ ని పట్టుకొని వదలలేకుండా అలాగే ఉండిపోయింది. అది చూసి భావోద్వేగానికి గురయ్యాడు రాహుల్. జంతువులు మనకి పైనుండి దేవుడు పంపిన గిఫ్ట్. అవి మనపై స్వచ్ఛమైన ప్రేమని చూపిస్తాయి. నాకే గనుక ఛాన్స్ వస్తే.. నేను కచ్చితంగా ఈ అందమైన 'అబూబ' ని దత్తత తీసుకుంటాను మరియు ఇండియాకి కూడా తీసుకొస్తానని చెప్పుకొచ్చాడు రాహుల్. ఇలా జంతువులపై తన ప్రేమను వ్యక్తపరిచాడు రాహుల్.
 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.