Karthika Deepam2 : జ్యోత్స్న ప్లాన్ ని తిప్పికొట్టిన కార్తీక్.. పారిజాతం షాక్!
on Jun 26, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -393 లో..... కార్తీక్, దీప రాగానే జ్యోత్స్న ప్లాన్ ని మొదలుపెడుతుంది. నా డైమండ్ చెవి కమ్మ కన్పించడం లేదని పారిజాతం అంటుంది. అది దీప దొంగతనం చేసిందని పారిజాతం అంటుంది. దాంతో దీప షాక్ అవుతుంది. సాక్ష్యం లేకుండా అలా నిందించొద్దని కార్తీక్ అంటాడు. పారిజాతం కిచెన్ లోకి వెళ్లి అక్కడ పర్సు తీసుకొని వస్తుంది. అందులో చెవి కమ్మ ఉంటుంది.
ఇప్పుడు ఏం అంటారని పారిజాతం అంటుంది. దాంతో అందరు దీప దొంగతనం చేసిందని నమ్ముతారు. ఈ ఒక కమ్మ మాత్రమే పోయిందా అన్నీపోయాయా అని కార్తీక్ అనగానే అన్నీ ఉన్నాయ్ కావాలంటే చూపిస్తానని పారిజాతం లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్లి చేసేసరికి తన నగలు ఉండవు.. ఒక్క కమ్మనే అనుకున్న మొత్తం దొంగతనం చేసావా అని పారిజాతం అంటుంది. అదంతా కాదు పారు ఇప్పుడు మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళు నగలు ఉంటాయని కార్తీక్ అనగానే పారిజాతం వెళ్తుంది. ఎక్కడ రా నగలు.. అని అన్నీ వెతుకుతుంది. అప్పుడే పారిజాతం తన చెవి కమ్మ తెచ్చి దీప పర్సులో పెట్టె వీడియోని కార్తీక్ చూపిస్తాడు. అది చూసి పారిజాతం షాక్ అవుతుంది.
ఇప్పుడు కనుక వెళ్లి నా భార్య దొంగతనం చెయ్యలేదని చెప్పలేదనుకో ఈ వీడియో తాతకి చూపిస్తానని కార్తీక్ అంటాడు. పారిజాతం వెళ్లి దీప ఏ తప్పు చెయ్యలేదు.. నేను మర్చిపోయి అలా చేసానని అనగానే పారిజాతం పై శివన్నారాయణ కోప్పడతాడు. అనవసరంగా దీపని అన్నారు నేను కూడా ఒక మాట అన్నాను సారీ అని సుమిత్ర అనగానే.. అమ్మా మీరు ఎందుకు అలా అంటున్నారని దీప అంటుంది. అంటే ఏంటే నువ్వు ఏమైనా నా కూతురివా అని దీప బాధపడేలా సుమిత్ర మాట్లాడుతుంది. ఆ తర్వాత నా నగలు ఎక్కడరా అని కార్తీక్ ని పారిజాతం అడుగుతుంది. అవి నా దగ్గర ఉన్నాయ్ నచ్చినప్పుడు ఇస్తానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



