గంగపై నింద వేసిన ఇషిక.. పాప మిస్ అవుతుందా!
on Sep 12, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -53 లో..... మక్కం ని తీసుకొని గంగ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ఇన్‌స్పెక్టర్ కి గతంలో ఒకమ్మాయికి ఇలా జరిగింది.. ఒకతను ఆమ్మాయిని గెస్ట్ హౌస్ కి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు నేను అడ్డుకున్నాను.. అతన్ని చూడలేదు. కానీ ఆ కార్ నెంబర్ గుర్తు ఉందని గంగ చెప్తుంది. ఇందాక ఆ కార్ నంబర్ గల కార్ కనిపించింది కానీ నేను వెళ్ళేలోపే వెళ్ళిపోయిందని గంగ చెప్తుంది.
అంటే నువ్వు ఇందాక స్పీడ్ గా వచ్చింది అందుకా అని మక్కా అంటాడు. ఎందుకు గంగ ఇవ్వన్నీ.. నువ్వే ప్రాబ్లమ్స్ లో ఉండి రుద్ర సర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావ్ అ మక్కం అనగానే అలా అనుకోవద్దు మనిషికి మనిషే సాయం.. నన్ను రుద్ర సర్ అలా అనుకోబట్టే కాపాడారు కదా అని గంగ అంటుంది. గంగ చెప్పిన నంబర్ ఇన్‌స్పెక్టర్ నోట్ చేసుకొని మేమ్ కనుక్కుంటామని అంటాడు. ఆ తర్వాత గంగ మక్కంని తీసుకొని బయటకు వస్తుంది. అప్పుడే చిన్ని వాల్ల వార్డెన్ ఫోన్ చేసి మీరు వస్తానన్నారు కదా ఇక రాకండి విసిటింగ్ హౌర్స్ అయిపోయాయి మళ్ళీ సర్ కోప్పడుతారని చెప్పగానే అయ్యో పాపని కలవలేదు.. మిస్ అవుతుంది. ఈ రోజు కూడా పాప చెప్పిన అతన్ని చూడలేదని అనుకుంటుంది.
ఆ తర్వాత ఇందుమతి దగ్గరికి ఇషిక వెళ్లి ఆంటి మీ నెక్లెస్ కావాలి ఇస్తారా అని అడుగుతుంది ఇస్తానని వెళ్లి లాకర్ లో చూసేసరికి నెక్లెస్ ఉండదు.. నా నెక్లెస్ పోయిందని ఇషిక చెప్తుంది. ఇంట్లో అందరిని పిలిచి విషయం చెప్తుంది ఈ దొంగతనం ఈ గంగ వాళ్ళ నాన్న పైడిరాజు చేసి ఉంటాడని ఇందుమతి అంటాడు. నేను ఏం తియ్యలేదని పైడిరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



