Illu illalu pillalu :శ్రీవల్లి పెట్టిన చిచ్చు.. ప్రేమ తప్పించుకుంటుందా!
on Sep 12, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -261 లో... నర్మద దగ్గరికి శ్రీవల్లి వెళ్లి.. సాగర్ ఏం ఎగ్జామ్ రాసాడా అని అడుగుతుంది. అంటే మా ఫ్రెండ్ మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూసిందట అని శ్రీవల్లి అనగానే నర్మద షాక్ అవుతుంది. అదేం లేదు మేమ్ పెళ్లికి వెళ్ళామని నర్మద స్ట్రాంగ్ గా చెప్తుంది. వెళ్తే పెళ్లిలో దిగిన ఫొటోస్ చూపించమని శ్రీవల్లి అడుగుతుంది. నువ్వు అడుగుతావని తెలియక దిగలేదని నర్మద కోపంగా సమాధానం చెప్తుంది.
ఆ తర్వాత ప్రేమ దగ్గరికి శ్రీవల్లి వెళ్లి నువ్వు ఒక అబ్బాయి వెంట పరుగెత్తడం చూసానని అంటుంది. ఎవరిని చూసి ఎవరు అనుకున్నావోనని శ్రీవల్లిపై ప్రేమ కోప్పడుతుంది. ఆ తర్వాత ప్రేమ కళ్యాణ్ తరుముతున్న ఫోటో పేపర్ లో వస్తుంది. అది శ్రీవల్లి కంట పడుతుంది. వెంటనే ఈ విషయం మావయ్య గారికి చెప్పాలని అనుకుంటుంది. మరొకవైపు అమూల్య కాలేజీకి వెళ్తుంటే విశ్వ చూసి నవ్వుతాడు. అమూల్య చెప్పు చూపిస్తుంది. అదంతా భద్రవతి చూస్తుంది. అది అంత ఈజీగా ట్రాప్ లో పడేటట్టు లేదని విశ్వ అనగానే ఆ ఇంట్లో ఒకరి సపోర్ట్ కావాలి. అప్పుడు ఈజీ అవుతుందని భద్రవతి అంటుంది.
అప్పుడే శ్రీవల్లి వాళ్ళకి బయట కన్పిస్తుంది. ఆ శ్రీవల్లి తన అమ్మ గ్రిప్ లో ఉంటుంది. వాళ్ళ అమ్మ మనం చెప్పినట్టు వినేలా చెయ్యాలని భద్రవతి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి పేపర్ తీసుకొని వెళ్లి రామరాజుకి చూపిస్తుంది. అది రామరాజు చూసి షాక్ అవుతుంది. ఆ అబ్బాయి ఎవరు ప్రేమ అని రామరాజు అడుగుతాడు. తరువాయి భాగంలో ప్రేమకి వచ్చిన బొకేని శ్రీవల్లి తీసుకుంటుంది. అది తీసుకొచ్చి ధీరజ్ కి ఇస్తుంది. అసలు ఆ కొరియర్ లో ఏముంది.. ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతుందని కొరియర్ ఓపెన్ చెయ్యాలని అనుకుంటాడు ధీరజ్. అప్పుడే ప్రేమ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



