Bigg Boss 9 Telugu: ఓటింగ్ లో సుమన్ శెట్టి టాప్.. లాస్ట్ లో శ్రష్టి వర్మ, ఫ్లోరా సైనీ!
on Sep 12, 2025

బిగ్ బాస్ సీజన్-9 మొదలై అప్పుడే నాలుగు రోజులు పూర్తయింది. హౌస్ లో పదిహేను మంది కంటెస్టెంట్స్ ఉండగా దాదాపు అందరి నిజస్వరూపాలు బయటకొచ్చాయి. మొన్నటి ఎపిసోడ్ లో సంజన చేసిన గుడ్డు దొంగతనం వల్ల ఓనర్స్ అండ్ రెంటర్స్ మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో అందరు తనని టార్గెట్ చేసి నామినేట్ చేశారు.
ఇక హౌస్ లో పదిహేను మంది కంటెస్టెంట్స్ ఉంటే వారిలో తొమ్మిది మంది నామినేషన్ లో ఉన్నారు. రాము రాథోడ్, డీమాన్ పవన్, ఫ్లోరా సైనీ, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ నామినేషన్ లో ఉన్నారు. బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ ఓటింగ్‌లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. 7/G బృందావన కాలనీ, జయం వంటి సినిమాలతో పాటు దాదాపు మూడొందల పైగా చిత్రాలలో కమెడియన్‌గా పనిచేసిన సుమన్ శెట్టి టాప్‌లోకి వచ్చేశాడు. ఇరవై నాలుగు శాతం ఓట్లతో సుమన్ శెట్టి అత్యధికంగా ఓట్లని పొందాడు . రేస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నా వాళ్లందర్నీ వెనక్కి నెట్టి సుమన్ శెట్టి టాప్‌లోకి వచ్చేశాడు. ఆ తరువాత ఇరవై శాతం ఓట్లతో సీరియల్ నటి తనూజ గౌడ ఉంది. ఇక కమెడియన్ ఇమ్మాన్యుయల్ పదిహేను శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంటే.. డీమన్ పవన్ పదకొండు శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ వారం గొడవలకు కారణమైన సంజనా గల్రానీ ఎనుమిది శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉండగా రాము రాథోడ్‌కి కూడా ఎనిమది శాతం ఓట్లే పడ్డాయి.
రీతూ చౌదరికి కేవలం ఆరు శాతం ఓట్లు పడ్డాయి. ఇక ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మలు రెండు శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉన్నారు. ఈ అన్ అఫీషియల్ ఓటింగ్‌ని బట్టి చూస్తే.. ఫ్లోరా సైనీ, శ్రష్టి వర్మ ఈ ఇద్దరిలో ఒకరు తొలివారంలో బిగ్ బాస్ హౌస్‌ను వీడొచ్చు. మన అంచనా ప్రకారం.. శ్రష్టి వర్మ ఈవారం సేఫ్ అయ్యి ఫ్లోరా సైనీ ఎలిమినేట్ కావడానికే ఎక్కువ అవకాశం ఉంది. శ్రష్టి వర్మ హౌస్‌లో ఉంటే కంటెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్లోరా సైనీ అలియాస్ ఆశా సైనీ ఈవారం కాకపోతే వచ్చేవారం అయినా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లాల్సిందే. అలా పంపిచడానికే సీనియర్, సీరియల్ ఆర్టిస్ట్‌లను తీసుకొస్తుంటారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



