ENGLISH | TELUGU  
Home  » TV News

లహరి న్యూ బేబీ బంప్...న్యూ ఫీలింగ్స్!

on May 6, 2023

బుల్లితెర నటి లహరి అంటే తెలియని వారు ఉండరు.  ‘చక్రవాకం’తో సీరియల్‌ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయింది.  ‘మొగలిరేకులు’, ‘శ్రావణ సమీరాలు’  ‘రాధ మధు’,  ‘పుట్టింటి పట్టుచీర’ వంటి సీరియల్స్ లో నటించింది. ‘కల్యాణ తిలకం’ లో చేసిన డ్యూయల్ రోల్ కి అలాగే ‘ముద్దుబిడ్డ’ సీరియల్ కి అవార్డ్స్ అందుకుంది ఇంకా ‘రాధ మధు’ సీరియల్‌కి నంది అవార్డు కూడా దక్కింది. ‘పక్కింటి అమ్మాయి, అత్తో అత్తమ్మ కూతురో, మమతల కోవెల, గోకులంలో సీత ఇలా ఎన్నో సీరియల్స్ లో నటనకు స్కోప్ ఉన్న రోల్స్ లో చేసింది. కందిరీగ, డాన్‌ సీను, ఆరెంజ్, గ్రీకువీరుడు, రారా కృష్ణయ్యా వంటి మూవీస్ లో లో కనిపించింది. ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్ డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తన ఫాన్స్ కి, నెటిజన్స్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు లహరి ఆమె భర్త ధీరేన్. 

తన బేబీ బంప్ ని ఈ వీడియోలో చూపించింది. ఈ విషయం గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి లెఫ్ట్ సైడ్ కి తిరిగి పడుకుంటోందట అలాగే డిఫరెంట్ వెరైటీస్ స్వీట్స్ తింటోందట అలాగే కాఫీ స్మెల్ పడడం లేదు అని కాఫీ కూడా తాగడం లేదట. ఆడపిల్ల పుడితే బెస్ట్ అని లహరి హస్బెండ్ ధీరేన్ చెప్పాడు. అమ్మాయి పుడితే తన మేకప్ సామాన్లు, డ్రెస్సులు, జ్యువెలరీ అన్నీ ఇచ్చేస్తుందట.. "మాకు మొదటి బిడ్డ కాబట్టి నాకు అమ్మాయి ఐనా అబ్బాయి ఐనా ఎవరైనా ఓకే" అని చెప్పింది లహరి. "నా బేబీ బంప్ చూసారు కదా నాకు ఎన్ని మంత్స్ ఉంటాయో మీరు గెస్ చేసి చెప్పండి" అంటూ నెటిజన్స్ కి ఒక టాస్క్ ఇచ్చింది లహరి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.