ఫేక్ లోన్ యాప్స్ నిర్వాకం.. సూసైడ్ చేసుకున్న నూకరాజు! కదిలించిన స్కిట్!!
on Nov 22, 2022

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎప్పటిలాగే సరికొత్తగా అలరించడానికి సిద్దమయ్యింది. దీనికి సంబంధించి న్యూ ప్రోమో రిలీజ్ కూడా ఐపోయింది. ఈ వారం 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా' కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇందులో బుల్లితెర స్టార్స్ అంతా కూడా వెరైటీ గేమ్ ఆడారు. చిన్నప్పుడు పిల్లలంతా ఆడే సాక్ రేస్ ని వీళ్లంతా ఇప్పుడు "గోనెలో గెంతులు" పేరుతో ఆడి ఎంటర్టైన్ చేశారు.
ఇక ఈ షోకి చరణ్ అర్జున్ ని తీసుకురావడం, అతనితో "నువ్వో రాయి నేనో శిల్పి" సాంగ్ పాడించడం హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన సాంగ్ పాడుతున్నంత సేపు ఇంద్రజ అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయింది. "అమ్మ ఒడిలో పడుకున్నాక బుజ్జగించినప్పుడు ఎలా ఉంటుందో అలా వుంది మీ పాట" అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక నూకరాజు, రాఘవ అందరూ కలిసి ఒక స్కిట్ ప్లే చేశారు. ఈమధ్య కాలంలో ఫేక్ లోన్ యాప్స్ కారణంగా ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోయిన కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఈ స్కిట్ ని ఆద్యంతం రక్తి కట్టించారు. నూకరాజు సూసైడ్ చేసుకొన్న సీన్ అందరి హృదయాల్నీ కదిలించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



