‘నేను కచ్చితంగా వాళ్లకు సారీ చెప్పాలి’.. ఎమోషనల్ అయిన రష్మీ!
on Nov 22, 2022

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎప్పటిలానే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో రెడీ అయ్యింది. ఇందులో రష్మీ ఒక కొత్త ఐడియాతో ఎంట్రీ ఇచ్చింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' స్టేజి మీద ఒక టేబిల్ వేసి దానికి ఒక 8 గాజు గ్లాసులు పెట్టి అందులో ఎల్లో, ఆరెంజ్ జ్యూస్ పోసింది. ఇక ఆ జ్యూస్‌లో లో ఒక సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్ వేసింది. ప్రతీ జ్యూస్ గ్లాస్‌లో ఈ కాయిన్స్ వేసింది. ఇక "ఈ జ్యూస్ తాగాక ఫైనల్‌గా సిల్వర్ కాయిన్ వస్తే గనక ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే ఈ స్టేజి ద్వారా ఆ పర్సన్‌కి థ్యాంక్స్ చెప్పొచ్చు" అని చెప్పింది.
"అదే జ్యూస్ తాగాక ఫైనల్‌గా గోల్డ్ కాయిన్ వస్తే గనక వాళ్ళు ఎవరికైతే సారీ చెప్పాలి అనుకుంటున్నారో వాళ్లకు ఈ స్టేజి ద్వారా సారీ చెప్పొచ్చు" అని కూడా చెప్పింది రష్మీ. ఈ కాన్సెప్ట్ థీమ్ విన్నాక ఆటో రాంప్రసాద్ "ఫస్ట్ నువ్వే స్టార్ట్ చెయ్యి" అని చెప్పేసరికి, రష్మీ జ్యూస్ తాగింది. కానీ లాస్ట్‌లో గోల్డ్ కాయిన్ వచ్చింది. అంటే సారీ చెప్పాల్సిన టైం వచ్చిందన్నమాట.
గోల్డ్ కాయిన్‌ని చూసిన ఆటో రాంప్రసాద్ "ఎవరికి సారీ చెపుదామనుకుంటున్నావ్?" అని అడిగాడు. "నేను కచ్చితంగా వాళ్లకు సారీ చెప్పక తప్పదు" అని ఎమోషనల్ అయ్యింది. రష్మీ మాటలకు ఇంద్రజ కూడా చాలా బాధ పడింది. ఇంతకు ఎవరెవరు ఈ జ్యూస్ తాగారు, వాళ్లకు ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ వచ్చాయి, వాళ్ళు ఎవరెవరికి సారీ, థ్యాంక్స్ చెప్పారో తెలియాలి అంటే సండే వరకు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



