ట్రాక్టర్, బైక్ మీద సుదీప స్టిల్స్.. ఇదీ నెటిజెన్స్ రిక్వెస్ట్!
on Nov 22, 2022
.webp)
సుదీప అలియాస్ ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. చైల్డ్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన పింకీ అలియాస్ సుదీప తన పర్సనల్స్ ని, ప్రొఫెషన్ కి సంబంధించిన అప్ డేట్స్ ని నెటిజన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు సుదీప ట్రాక్టర్ ఎక్కి సందడి చేస్తోంది. పొలంలో ట్రాక్టర్ ఎక్కి నిలబడిన పిక్ ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ పిక్ నెటిజన్స్ ని అలరిస్తోంది. అలాగే ఒక పెద్ద బైక్ తో దిగిన పిక్స్ ని కూడా షేర్ చేసింది. "ఎనీవన్ డౌన్ టు రేస్" ఎవరైనా నాతో పోటీకి దిగుతారా ? అని ఛాలెంజ్ విసిరింది. ఇలా సుదీప సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది.
ఇక సుదీపను ఇన్‌స్టాగ్రామ్‌లో 52K మంది ఫాలో అవుతున్నారు. నెటిజన్స్ ఈమె పిక్స్ చూసి "మీరు మళ్ళీ ఎక్కువ మూవీస్ లో చేయాలి" అని రిక్వెస్ట్ చేస్తున్నారు. "ఏమిటి మీరు బైక్ కూడా నడుపుతారా" అని సుదీపను అడుగుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



