ENGLISH | TELUGU  
Home  » TV News

తన హాట్ ఫోటోస్ గురించి బోల్డ్ గా సమాధానమిచ్చిన ఇనయా!

on May 6, 2023

ఇనయా ఒక ఫైర్ బ్రాండ్.. ఒక లేడీ టైగర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మడు గురించి చాలానే ఉంది. బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ సంపాదించి సెలబ్రిటీ రేంజ్ ని పొందింది. సోషల్ మీడియా అంతా నాదే అన్నట్లుగా పోస్ట్ లతో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది ఇనయా. ఆమె ఏం చేసినా ట్రెండింగ్ లోకి వెళ్తుంది. అంతలా ఇన్ స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది ఇనయా. ప్రతీదానిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పే ఇనయాని ఇన్ స్పిరేషన్ గా తీసుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. 

నిన్నటి వరకు ఊటీ అంతా చుట్టేసి వచ్చిన ఈ బ్యూటీ.. ఊటీ అందాలతో తన అందాలను జత చేసి.. హాట్ ఫొటోస్ తో ఫ్యాన్స్ ని మస్త్ ఖుషి చేసింది. ఊటీ నుండి ఇంటికి రాగానే ఫ్యాన్స్ తో మాట్లాడాలని అనుకుందంట. అందుకే "ఓన్లీ టెన్ క్వశ్చన్స్ అస్క్ మీ" అంటూ ఆఫర్ ఇచ్చేసింది. ఫ్యాన్స్ అడిగిన ఆ పది క్వశ్చన్ లకు ఆసక్తికరమైన సమాధానం చెప్పింది ఇనయా. వాట్ ఈజ్ యువర్ లైఫ్ పాలసీ అని ఒక అభిమాని అడుగగా.. పాలసీ అంటే చాలానే ఉన్నాయి.. అది చెయ్యకూడదు.. ఇది చెయ్యకూడదనేదేమీ లేదు.. బట్ ఒక పాలసీ అంటూ ఉంటే అది ముందు నాకు నచ్చాలి.. నచ్చితేనే అది చేస్తాను.. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలమని సమాధానమిచ్చింది ఇనయా.  రీసెంట్ ఫోటోస్ అన్నీ కూడా స్పైసీ అండ్ హాట్ లుక్స్ తో ఉన్నాయి.. రీజని  ఏంటని మరొకరు అడగుగా.. ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు.. హాట్ గా అని ఏం లేదు.. నా ఫోన్ లో జస్ట్ క్యాజువల్ గా.. నేను అలా బయటకు వెళ్లినప్పుడు తీసుకున్నవి.. నా దాంట్లో అప్లోడ్ చేసుకున్న అంతే.. అది చూసే వాళ్ళ పర్ స్పెక్టివ్ ని బట్టి ఉంటుంది.. కొంతమందికి నేను క్యూట్ గా కనిపించొచ్చు.. కొంతమందికి నేను హాట్ గా కనిపించొచ్చు.. కొంతమందికి నేను సెక్సీ గా కనిపించొచ్చు.. చూడాలనిపిస్తే చూడండి లేకుంటే అన్ ఫాలో చేసుకోండంటూ ఘాటుగానే సమాధానమిచ్చింది ఇనయా. ప్రజెంట్ ఒక్కరే ఉంటున్నారా అని ఒకరు అడుగగా.. ప్రెజెంట్ ఒకదాన్నే ఉంటున్నాను.. అమ్మ వాళ్ళ కోసం పెద్ద ఫ్లాట్ తీసుకున్నానని ఇనయా అంది. మీకు ఏదైనా సీరియల్ లో నెగెటివ్ క్యారెక్టర్ వస్తే చేస్తారా అని ఒకరు ప్రశ్నించగా.. ఇంత అందమైన ఫేస్ పెట్టుకొని నెగెటివ్ క్యారెక్టర్ చెయ్యాలా చెప్పండంటూ బుంగమూతి పెట్టింది ఇనయా. 

మీరు బిగ్ బాస్-6 వాళ్ళని మిస్ అవుతున్నారా అని ఒకరు అడుగగా.. నేను ఎవరిని మిస్ అవ్వట్లేదు.. ఎందుకు మిస్ అవ్వాలి.. అందరూ హైదరాబాద్ లోనే కదా ఉన్నారంటూ చెప్పింది. మీ ఫేవరెట్ IPL టీం ఏంటని ఒకరు అడుగగా.. ఎప్పటికీ ధోని ఫ్యాన్ నే.. మై ఫేవరెట్ టీం CSK అంటూ సమాధానమిచ్చింది ఇనయా. ఒక అభిమాని అక్క అని పిలవడంతో.. నాకు అక్క అని పిలిస్తే ఫ్యామిలీ లాగా అనిపిస్తారు, మీ అందరిని ఒకసారి నేను కలుస్తానని సమాధానమిచ్చింది ఇనయా. ఇలా తన ఫ్యాన్స్ తో మెసేజ్ ల రూపంలో కాకుండా వీడియోల రూపంలో సమాధానమిచ్చింది ఇనయా.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.