ENGLISH | TELUGU  
Home  » TV News

కావ్యకి పదహారు రోజుల పండుగ జరిపించమని అడగడానికి వెళ్ళిన మీనాక్షి!

on May 6, 2023

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -88 లో.. బ్రహ్మముడి వేసి కావ్య, రాజ్ లు పక్కపక్కన ఉండేలా ప్లాన్ చేసింది ఇందిరాదేవి. పూజ పూర్తి చేసి బ్రహ్మముడి విప్పుతుంది. ఆ తర్వాత నేను వెళ్లొచ్చా అని రాజ్ అంటాడు. లేదు ఇంకో తంతు ఉందంటూ కళ్యాణ్ వెటకారంగా మాట్లాడతాడు.

మరొకవైపు కనకంని పక్కింటి ఆవిడ ఒక ఫంక్షన్ కి పిలుస్తుంది. తప్పకుండా వస్తానని కనకం అంటుంది. కనకం ఆలోచనలో పడుతుంది.. అన్నీ బాగుంటే నా కూతురుకి కూడా పదహారు రోజుల పండుగ చేసి.. నల్ల పూసలు మెడలో వేసేదాన్ని.. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు అయిందని కనకం బాధపడుతుంది. పెళ్ళయినప్పటి నుండి దానికి ఏ అచ్చట ముచ్చట తీర్చలేదు.. ఈ పండుగైనా చేద్దామని కృష్ణమూర్తితో అంటుంది కనకం. ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తామని కృష్ణమూర్తి అంటాడు. స్వప్న అక్క వల్ల పరువు మొత్తం పోయింది.. మనం వెళ్ళి అడిగితే.. కావ్య అక్కని ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతామని అప్పు అంటుంది. ఇంతటితో ఈ మ్యాటర్ వదిలేయమని కనకంతో అప్పు అంటుంది. తెలిసి తెలిసి అవమానాన్ని వెతుక్కుంటూ వెళ్తారా? ఆ తర్వాత నీ ఇష్టం అని కృష్ణమూర్తి అంటాడు. మరొకవైపు కావ్య కాఫీ తీసుకొని.. రాజ్ గదిలోకి వస్తుంది. l

అప్పుడే రాజ్ స్నానం చేసి టవల్ తో బయటకు వస్తాడు. ఏంటి సరాసరి లోపలికి వస్తున్నావని రాజ్ అడుగుతాడు. నిన్న రాత్రి నుండి ఈ గది నాది కూడా అని కావ్య అంటుంది. ఇది నా హక్కు అని కావ్య అనగానే.. హక్కు అని మాట్లాడుతున్నావ్? గడువు లోగా.. నువ్వు మీ అక్క వెనకాల ఉన్న గుంటనక్క ఎవరో చెప్పలేదో.. మూట ముల్లె సర్దుకొని పోవాలి మరిచిపోకని రాజ్ అంటాడు. నిజానిజాలు బయట పెట్టాకే వెళ్తానని కావ్య అంటుంది. ఈ రాజ్ ఎప్పుడు తనని తాను తక్కువ అంచనా వెయ్యడు.. మిస్టర్ పర్ఫెక్ట్ ఇక్కడ అని రాజ్ అంటాడు. అవును అన్నింటిలో మిస్టర్ పర్ఫెక్ట్ బాడీ లో మాత్రం డిఫెక్ట్ ఉంది.. అది మీకు తెలియదు.. అదే గురక. రాత్రి తెలిసిందని కావ్య అనగానే.. ఛీ ఛీ నేను గురక పెడతానా అంటూ‌ రాజ్ వాదిస్తాడు.

మరొకవైపు మీనాక్షి దగ్గరికి కనకం వెళ్ళి.. ఎలాగైనా కావ్యకి పదహారు రోజుల పండుగ చెయ్యాలి అక్కా.. ఎలాగైనా దుగ్గిరాల వారి ఇంటికి వెళ్లి వాళ్ళని ఒప్పించు అని చెప్తుంది. మీనాక్షి దానికి బలవంతంగా సరే అంటుంది. అప్పుకి కావ్య ఫోన్ చేసి ఎలాగైనా స్వప్న వెనకాల ఉన్న వ్యక్తి గురించి తెలుసుకో.. నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు.. నీ మీదే నా హోప్స్ అని కావ్య అనగానే.. సరే నేను చూసుకుంటా అని అప్పు అంటుంది. ఆ తర్వాత మీనాక్షి కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని.. దుగ్గిరాల ఇంటికి వెళ్తుంది. అపర్ణ వాళ్ళని చూసి.. ఆగండి ఎందుకు వచ్చారని అంటుంది. పెద్దమ్మ ఎందుకు వచ్చిందని కావ్య టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.