ఆది - రాంప్రసాద్ గేస్... షాక్‌లో వర్ష
on Sep 10, 2025
.webp)
జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో నాటీ నరేష్ చేసిన కామెంట్ వింటే వామ్మో అనిపిస్తుంది. వర్ష చిలకాకుపచ్చ చీరతో, నరేష్ కూడా లుంగీ కట్టుకుని స్టేజి మీదకు భార్యాభర్తల్లా వచ్చి "రారా ఉల్లాస వీరుడా" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. "ఆది - రాంప్రసాద్ లాగా మీరు రొమాంటిక్ గైలా ఉండండి" అంటూ వర్షా ముద్దుగా చెప్పింది. దాంతో నరేష్ వెంటనే " వాళ్ళు గైస్ కాదు గేస్" అన్నాడు అనేసరికి వర్ష నోరెళ్లబెట్టింది. ఇక రాకెట్ రాఘవ, సీనియర్ నటి అన్నపూర్ణ కలిసి స్కిట్ వేశారు. "కరెంట్ పోయింది అని ఎవరు కంప్లైంట్ ఇచ్చారు" అంటూ ఒక కరెంట్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి వచ్చి "కరెంట్ ఉంది కదండీ" అన్నాడు. వెంటనే అన్నపూర్ణమ్మ "ఇంట్లో కరెంట్ ఉందయ్యా మా అల్లుడిలోనే కరెంట్ పోయింది " అని చెప్పింది.
ఆ మాటకు రాఘవ పరువు మొత్తం పోయినట్టైంది. ఇక ఫైనల్ గా రాకింగ్ రాకేష్ - సుజాత జోడి స్కిట్ వేశారు. "పెళ్ళికి ముందు 24 గంటలు టాకింగ్..పెళ్లయ్యాక 4 గంటలే టాకింగ్. మిగతా 20 గంటలు ఎక్కడ టాకింగ్" అంటూ ఈ జంట మధ్య వచ్చిన గొడవను సాల్వ్ చేయడానికి వచ్చిన పెద్దమనుషులు మనో, ఖుష్బూని అడిగింది సుజాత. ఇక ఈ స్కిట్ ఎలా ఉంది అంటూ రష్మీ ఆడియన్స్ ని అడిగింది. దాంతో అందరూ సూపర్ అంటూ చెప్పారు. "ఇంట్లో పెళ్ళాం ప్రేమ ఇవ్వకపోతే బయటకు వెళ్లి కొనుక్కోవాలా. మీరు ఏమంటారు" అని రష్మీ అడిగింది. దాంతో ఆడియన్స్ లో ఒకతను లేచి "ఈ ప్రశ్నకు మౌనమే సమాధానం" అని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



