విజయ్ ఆంటోని చెప్తే చేస్తాడంతే.. నెక్స్ట్ మూవీకి ఇంకో ఐదుగురికి...
on Sep 10, 2025
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి "భద్రకాళి" మూవీ టీమ్ వచ్చింది. ఇక విజయ్ ఆంటోనీ స్టేజి మీదకు రాగానే ఇంద్రజ ఆయన్ని పొగిడింది. "లాస్ట్ టైం ఆయన మార్గన్ మూవీ టైములో ఇక్కడికి రావడమే కాదు పాడడానికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అలాగే ఒకటి కాదు రెండు సాంగ్స్ భోలే షావలీ గారికి ఇచ్చారు." అంటూ విజయ్ ఆంటోనీ చెప్పినట్టే ఆఫర్ ఇచ్చారు. దాంతో విజయ్ మళ్ళీ ఇంకో ప్రామిస్ చేశారు. "నేను మళ్ళీ చెప్తున్నా నా నెక్స్ట్ మూవీకి ఇక్కడి నుంచి ఐదుగురిని తీసుకుంటాను" అని చెప్పారు. దాంతో స్టేజి మీద ఉన్న ఆర్టిస్టులంతా ఫుల్ ఖుషి ఇపోయారు. ఇక ఫైనల్ గా మంగాదేవిగారు సత్య హరిశ్చంద్ర నాటకం నుంచి హరిశ్చంద్ర పాత్ర పద్యాలు రాగయుక్తంగా ఆలపించారు. "మగవాళ్ళతో పోటీ పడి పాడగల సత్తా ఉన్న ఏకైక మహిళ మంగాదేవి గారు.
మా నాన్న కోట నరసింహ రావు గారు కూడా మంగాదేవి గారి వాయిస్ కి చాలా పెద్ద ఫ్యాన్ మంగాదేవి గారిని స్టేజి మీదకు తీసుకురమ్మని ఆయనే చెప్పాడు. నాన్న చూడండి మంగాదేవి గారు" అంటూ ఆది వాళ్ళ నాన్న గురించి చెప్పుకొచ్చాడు. ఇక నెటిజన్స్ ఐతే మంగాదేవి గారి గురించి చాలా కామెంట్స్ చేశారు. "మంగదేవి గారు నీ గుర్తించి తీసుకోనిరావడం ఆనందంగా వుంది...హరిశ్చంద్ర పద్యం అంటే మామూలుగా ఉండదు.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మధ్యలో ఫోక్ సాంగ్స్ తో కొంతమంది ఆడియన్స్ ని అలరించారు. ఇక ఆది తన సిగ్నేచర్ స్టెప్ వేస్తూ డాన్స్ చేసాడు. అలాగే మూవీస్ లో పోర్షన్ సాంగ్స్ కి సంబందించిన పిక్స్ ని వేసి ఆ సాంగ్ ని గెస్ చేసే ఒక టాస్క్ పెట్టి ఆడించాడు ఆది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



