మధు అర్జెంటుగా మీ ఆవిడని కట్ చెయ్.. అమ్మో వీడు వైల్డ్ ఆర్టిస్ట్
on Sep 10, 2025

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి సూపర్ స్టార్స్ రి-యూనియన్ నిర్వహించారు. ఈ షోకి అలనాటి సీనియర్ సీరియల్ యాక్టర్స్ వచ్చారు. రాజ్ కుమార్, సునయన, సీనియర్ ఆర్టిస్ట్ మధుసూదన రావు-రుతురాగాలు శృతి, కౌశిక్, ఇంద్రనీల్ - మేఘన, సీనియర్ నటుడు ప్రదీప్, ప్రీతి నిగమ్ వంటి వాళ్లంతా వచ్చారు. శ్రీముఖి వీళ్లందరితో మంచి ఫన్ చేసింది. అలనాటి తారలతో అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం అంటూ చెప్పింది శ్రీముఖి. "ప్రదీప్ గారు ఇక్కడ ఉన్న లేడీస్ లో ఫేవరేట్ ఒక్కరినే మాత్రమే సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు" అని అడిగాడు. "శ్రీముఖినే" అని చెప్పాడు ప్రదీప్. ఇక శృతి వాళ్ళాయన మధుసూదన్ రావును పట్టుకుని "మధు ఈవిడ నీకు బాగా లైన్ వేస్తోంది..నాకు నచ్చట్లేదు. ఈవిడను ట్రాక్ లోంచి కట్ చెయ్ " అంటూ మధు వాళ్ళావిడ శృతిని చూపిస్తూ అడిగింది. "దా దా" అంటూ మధు శ్రీముఖి చేతిని పట్టుకుని వెళ్ళబోయాడు. దానికి శ్రీముఖి ఆ అని నోరెళ్లబెట్టింది.
వెంటనే సునయన వచ్చి శృతిని పట్టుకుని "ఇదేదో అపశ్రుతిలా ఉంది" అంటూ చెప్పేసరికి శృతి అవాక్కయ్యింది. ఇక రాజ్ కుమార్ ని చూసి "మిమ్మల్ని చూసిన ప్రతీ సారి ముద్దుగా ఒక్కటే పిలవాలనుకుంటున్నాను. రాజా" అని పిలిచేసరికి రాజ్ కుమార్ కూడా సిగ్గుపడిపోయాడు. "రాజా రాజాధిరాజా" అనే సాంగ్ కి డాన్స్ చేసాడు. ఇక సునయనని పిలిచి "అబ్బాయిల్లో ఒక్కళ్లను సెలెక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు" అని అడిగింది శ్రీముఖి. "కౌశిక్ నా ఫస్ట్ హీరో కాబట్టి..అమ్మో వీడు వైల్డ్ ఆర్టిస్ట్" అని కౌంటర్ వేసేసరికి కౌశిక్ షాకైపోయాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



