Brahmamudi : కన్నకూతురిని అవమానించి పంపించేసిన తల్లి.. బాధపడ్డ రేవతి!
on Jul 26, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -783 లో.....అందరు స్వప్న వాళ్ల పాపకి గిఫ్ట్స్ ఇస్తుంటారు. రాజ్ కావ్య దగ్గరున్న గిఫ్ట్ తీసుకొని స్వప్న పాపకి ఇస్తాడు. ఆ తర్వాత ఏంటే కావ్య.. నా కూతురికి కనీసం గిఫ్ట్ కూడా తీసుకొని రాలేదని స్వప్న అంటుంది. అది నేను తీసుకొని వచ్చిందేనని కావ్య అంటుంటే పరువు తియ్యకండి కళావతి గారు అని రాజ్ అంటాడు. ఎవరు తీసుకొని వస్తే ఏంటి మేం ఇద్దరం ఒకటే కదా అని కావ్య అంటుంది.
అందరు తీసుకొని వచ్చారు నీ కూతురికి నువ్వేం తీసుకొని రాలేదా అని రాహుల్ ని ఇందిరాదేవి అడుగుతుంది. తీసుకొని వచ్చానని డ్రెస్ తీసుకొని వస్తాడు. అది చూసి ఇలాంటి డ్రెస్ నా కూతురికి ఎలా తీసుకోవాలనిపించిందని రాహుల్ పై స్వప్న కోప్పడుతుంది నా దగ్గర డబ్బు లేదు ఉన్నంతలో తీసుకున్నాను.. మాకు మీరు ఏదయినా ప్రాపర్టీ రాసివ్వండి అని రుద్రాణి అనగానే సరే అని ఇందిరాదేవి అంటుంది. వాళ్లకు వద్దు రాస్తే నా కూతురికి రాసివ్వండి అని స్వప్న అంటుంది. అలాగే అని ఇందిరాదేవి అనగానే రాహుల్, రుద్రాణి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు రేవతి, జగదీష్ ఇద్దరు దుగ్గిరాల ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు. నాకు భయంగా ఉందని రేవతి అంటుంటే మీ వాళ్ళకి నీపై కోపం పోయి ఉంటుంది. నువ్వేం భయపడకు అని జగదీశ్ దైర్యం చెప్తాడు.
ఆ తర్వాత కేక్ కట్ చేయండి ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారని అపర్ణ వాళ్ళు అంటుంటే ఇంకా రావల్సిన వాళ్ళున్నారు అని కావ్య అంటుంది. అప్పుడే రేవతి, జగదీశ్ వస్తారు. వాళ్ళని చూసి అందరూ షాక్ అవుతారు. అగు అక్కడే అని అపర్ణ అంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావని అపర్ణ కోప్పడుతుంది. మీరే కదా అత్తయ్య నిన్న పిలిచారని కావ్య అంటుంది. తను అని తెలిస్తే పిలిచేదాన్ని కాదని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో రేవతిని అవమానించి పంపిస్తుంది అపర్ణ. ఆ తర్వాత రేవతి ఫోటో చూసి అపర్ణ బాధపడుతుంటే మన బిడ్డ మీద ఇంకా కోపంగా ఉన్నావా అని సుభాష్ అడుగుతాడు. అదంతా కావ్య వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



