Karthika Deepam2 : దాస్ కి థాంక్స్ చెప్పిన శివన్నారాయణ.. కార్తీక్ సవాల్!
on Jul 26, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -419 లో.. కార్తీక్, దీప మాట్లాడుకుంటుంటే శౌర్య వచ్చి.. నాకు అమ్మ ఉంది.. నీకు ఉంది.. అమ్మ వాళ్ల అమ్మ ఎక్కడ అని కార్తీక్ ని అడుగుతుంది. అమ్మ వాళ్ల అమ్మ కలిసి ఉండాలని మొక్కుకోమని శౌర్యతో చెప్తాడు కార్తీక్. మా అమ్మ అక్కడ ఎలా ఉందో ఏంటో రేపు ప్రొద్దున అక్కడికి వెళ్ళాలని కార్తీక్ తో దీప అంటుంది.
ఆ తర్వాత ఏం జరిగిన సరే ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని పారిజాతం అనగానే నీ కొడుకుని నువ్వే రప్పించావా అని జ్యోత్స్న అడుగుతుంది. లేదని పారిజాతం అనగానే అయితే బావ నా చేత నిజం చెప్పించాలనుకున్నాడు. అది ఫెయిల్ అయితే ఇలా ప్లాన్ చేసాడన్నమాట అని జ్యోత్స్న అంటుంది. ఆ గౌతమ్ గాడు చూసావా వాడు చెడ్డవాడు అయ్యాడని నిన్ను చెడ్డదాన్ని చెయ్యాలనుకున్నాడు దీపని చంపాలని ట్రై చేసావని చెప్పబోతుంటే కార్తీక్ ఆపాడని పారిజాతం అంటుంది. బావకి నేను దీపని చంపించాలనుకున్నానని తెలుసని జ్యోత్స్న అంటుంది. రేపు దీప రానియ్ దాని సంగతి చెప్తానని పారిజాతం అంటుంది. మరుసటి రోజు శివన్నారాయణ ఇంటికి దాస్ వస్తాడు. చాలా థాంక్స్ దాస్ టైమ్ కి వచ్చి జ్యోత్స్న జీవితం కాపాడావని శివన్నారాయణ అంటాడు. అప్పుడే దీప వస్తుంది ఈ దీప వల్లే ఇదంతా అని పారిజాతం కోప్పడుతుంది.
ఫస్ట్ గౌతమ్ మంచివాడు కాదని చెప్పింది.. తర్వాత మంచివాడు అంటేనే కదా ఎంగేజ్ మెంట్ కి ఏర్పాట్లు చేసుకుందని పారిజాతం అంటుంది. మీరు ముందు చెప్తే నమ్మారా ఎప్పుడు మీరు దీప మాటలు నమ్మరని కార్తీక్ అంటాడు. అసలు గౌతమ్ గురించి ఎలా తెలుసుకున్నావని దాస్ ని శివన్నారాయణ అడుగుతాడు. కార్తీక్ చెప్పాడని దాస్ అనగానే.. నీకు ఎందుకు గౌతమ్ పై డౌట్ వచ్చిందని శివన్నారాయణ అడుగుతాడు. మావయ్య కనుక్కోమని చెప్పాడని కార్తీక్ అంటాడు. ఇక్కడ అందరు మంచివాళ్ళే అని దాస్ అనగానే నేను ఎప్పటికి ఆ దీపని నమ్మలేనని సుమిత్ర అంటుంది. నా భార్య పై ఇంకొక నింద ఉంది దశరథ్ మావయ్యని షూట్ చేసింది నా భార్య కాదని నిరూపిస్తాను లేదంటే దీప భర్తనే కాదని కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



